Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం మనం 2022లో ఉన్నాం. అయినా ఒక మహిళా ఆటో నడుపుతుంటే ఆశ్చర్యంగా చూస్తాం. ఇక ట్రక్ డ్రైవర్ అంటే నోట మాట రాదు. పురుష ప్రపంచానికే పరిమితం అనుకునే ఇలాంటి వృత్తిలోకి మహిళలు రావడం గొప్ప విషయం. వారిలో జూయ్సీ లింగ్డో ఒకరు. షిల్లాంగ్‌కు చెందిన ఈమె అమెజాన్‌కు ట్రక్ డ్రైవర్‌గా చేస్తూ చరిత్ర సృష్టించింది. రోజువారీ వేతనం నుండి అమెజాన్‌తో ట్రక్కింగ్ భాగస్వామి వరకు సాగిన ఆమె జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. తన ప్రాంతంలోని ఇతర మహిళలను ప్రభావితం చేస్తున్న ఆమె జీవిత విశేషాలు నేటి మానవిలో...
పురుషులు రాజ్యమేలుతున్న వృత్తిల్లో కొంతమంది మహిళలు ధైర్యంగా కొనసాగుతున్నారు. తామేంటో నిరూపించుకుంటున్నారు. అమెజాన్‌కు ట్రక్కింగ్గా మొదటి మహిళా ట్రక్ డ్రైవర్ మేఘాలయకు చెందిన ముప్పై అయిదేండ్ల జాయ్సీ లింగ్డో మూస పద్ధతులను బద్దలు కొట్టారు. ఆరు సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ అనుభవం ఉన్న జాయ్సీ జీవనోపాధి కోసం ట్రక్ డ్రైవింగ్‌ను ఎంచుకుంది. ఆమె చేసిన ఈ ధైర్యం డ్రైవింగ్ పట్ల వారి ప్రేమను వృత్తిగా మార్చుకునేలా ఇతర మహిళా డ్రైవర్లను ప్రేరేపించింది. ''ఈ ప్రాంతంలో పెరిగిన వ్యక్తిగా నాకు ఇక్కడి రూట్లు, పాస్‌లు బాగా తెలుసు. ఇక్కడ ట్రక్కు నడపడం నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. నిజానికి ఇది ఇప్పుడు నాకు గర్వకారణం'' అంటున్నారు జాయ్సీ.
ఆమే ఏకైక ఆధారం
తల్లి, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్న జూయ్సీ ఆ కుటుంబానికి ఆమే ఏకైక ఆధారం. తండ్రి పోయిన తర్వాత చాలా కాలం నుండి వారి బాధ్యత తనే చూసుకుంటుంది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జాయ్సీ గౌహతిలోని స్టీల్ కంపెనీతో సహా పలు కంపెనీలలో పనిచేసింది. స్థానిక దుకాణంలో స్టోర్ మేనేజర్‌గా కూడా పని చేసింది. రోజువారీ కూలీ చేసుకుంటూనే స్నేహితుల సహాయంతో డ్రైవింగ్ నేర్చుకుంది. దానిని ఆస్వాదించడంతో పాటు ఆ వృత్తిలో మంచి భద్రత ఉందని గ్రహించింది. ఆ విధంగా ఆమె మొదట ఓ పాఠశాల బస్సును నడపడం ప్రారంభించింది.
అభిరుచే నన్ను ప్రేరేపించింది
తర్వాత కాలంలో నగరంలోని అనేక ఇతర ప్రదేశాలలో పార్ట్ టైమ్ డ్రైవర్‌గా పని చేయడం కొనసాగించింది. డ్రైవింగ్ పట్ల ఆమెకున్న అభిరుచే అమెజాన్ ట్రక్కింగ్ భాగస్వామితో డ్రైవర్‌గా నమోదు చేసుకోవడానికి దారితీసింది. అందులో ఎంపికైనపుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. జాయ్సీ ఇప్పుడు గౌహతితో పాటు చుట్టుపక్కల డెలివరీల చేసే అమెజాన్ ట్రక్ డ్రైవర్లలో ఒకరు. ''నాకు రోడ్డు మీద ప్రయాణం చేయడం, వివిధ ప్రాంతాలకు వెళ్లడం, కొత్త వ్యక్తులను కలవడం చాలా ఇష్టం. ఈ అవకాశం స్వయం సమృద్ధితో జీవించాలనే నా అభిరుచిని కొనసాగించడానికి నన్ను ప్రేరేపించింది. డ్రైవింగ్‌ను వృత్తిగా కొనసాగించాలనుకునే మహిళలకు నా సలహా ఏమిటంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ కోసం కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి'' అని జాయ్సీ అంటుంది.
వైవిధ్యాన్ని పెంపొందించడానికి
వృత్తి పురుషాధిక్యతతో కూడుకున్నది అయినప్పటికీ ఆమె ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. నిజానికి తన ఉద్యోగ స్వభావం కారణంగా తనకు లభించే గౌరవాన్ని మనసారా పొందుతుందని ఆమె జతచేస్తుంది. తన దీర్ఘకాలిక ప్రణాళికల గురించి అడిగినప్పుడు జాయ్సీ ప్రతి రోజూ తనకు ఓ కొత్త ప్రణాళిక ఉంటుందని అంటుంది. అయితే ఈకామర్స్ దిగ్గజంతో ఎక్కువ కాలం కొనసాగాలనేది ఆమె ప్రాథమిక ఆలోచన. వైవిధ్యం, ఈక్విటీ, ఇన్క్లూసివిటీ (ణజుడ×) పట్ల తన నిబద్ధతను పెంపొందిస్తూ అమెజాన్ ఇండియా వర్క్‌ఫోర్స్‌లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడానికి, లాజిస్టిక్స్ స్పేస్‌లో వైవిధ్యాన్ని పెంపొందించడానికి స్థిరంగా ప్రయత్నాలు చేస్తోంది.
నేరుగా నిమగమై ఉంటుంది
ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉన్న స్పష్టమైన సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఒక మహిళ ట్రక్కర్గా ఉండడాన్ని అమెజాన్ సులభతరం చేస్తుందా? అనే దాని గురించి అమెజాన్ ఇండియా మిడిల్ మైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ వెంకటేష్ తివారీ మాట్లాడుతూ ''అమెజాన్ ట్రక్కింగ్ భాగస్వాములు ఆరోగ్యం, ప్రమాద బీమా ప్రయోజనాలను పొందేందుకు కంపెనీ ఇష్టపడే బీమా ప్రొవైడర్లతో నేరుగా నిమగమై ఉంటుంది. ఇంకా ఇది డ్రైవర్లను సురక్షితమైన డ్రైవింగ్ కోసం సాంకేతికతతో నడిచే పరిష్కారాల ద్వారా ఎనేబుల్ చేసింది. నావిగేషన్, ఆన్-టైమ్ మూవ్మెంట్, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఆలస్యం, అంతరాయాలను నివేదించడం ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడం ద్వారా ప్యాకేజీలను సమర్ధవంతంగా తరలించడానికి వీలు కల్పించింది. కంపెనీకి డ్రైవర్ సేఫ్టీ ట్రైనింగ్‌పై ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఇది ప్రతి అమెజాన్ సైట్లలో అంకితమైన రహదారి భద్రతా అంబాసిడర్లను అందిస్తుంది. రహదారి భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై డ్రైవర్లకు శిక్షణను అందిస్తుంది. దృశ్యపరంగా తనిఖీ చేయగల పారామితులపై వారానికి వాహనాలను తనిఖీ చేస్తుంది. మా ట్రక్కింగ్ భాగస్వామితో జాయ్సీ మొదటి మహిళా ట్రక్ డ్రైవర్ అయితే అమెజాన్ భారతదేశంలో 500 కంటే ఎక్కువ ట్రక్కింగ్ భాగస్వాములతో భాగస్వామ్యం కలిగి ఉంది. వారు వేలాది ట్రక్కింగ్ డ్రైవర్లకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారు'' అని ఆయన చెప్పారు.
వేధిస్తున్న సమస్యలు
ఎక్కువ గంటలు, విపరీతమైన షెడ్యూల్లు, కఠినమైన పని పరిస్థితులు, భద్రత వంటివి సాధారణంగా ట్రక్ డ్రైవర్లను వేధిస్తున్న కొన్ని సమస్యలు. ఇవి ఎక్కువ మంది మహిళలు ట్రక్ డ్రైవింగ్‌ను వృత్తిగా తీసుకోకుండా చేస్తాయి. ఇలాంటి సమస్యలు కొంత వరకైనా పరిష్కరించగలిగితే ఎంతోమంది మహిళలు ఈ వృత్తిని ఎంపిక చేసుకునేందుకు ధైర్యం చేస్తారు.