Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయాన్నే బడికి వెళ్లే పిల్లల నుంచి హడావుడిగా పనికి వెళ్లే పెద్దవారి వరకు చాలా మంది ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) దాటవేయడం సాధారణ విషయం. లేటుగా నిద్రలేవడం, ట్రాఫిక్ జామ్‌లు, సమావేశాలు, పిల్లల పాఠశాలలకు సిద్ధం చేయడం, అల్పాహారం మానేయడం కోసం చాలామంది చెప్పే సాకుల జాబితా కొనసాగుతూనే ఉంటుంది. అయితే మీరు రెగ్యులర్‌గా బ్రేక్ ఫాస్ట్ తింటున్నారా..? అల్పాహారం దాటవేయడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. జీవక్రియను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
రాత్రి భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది. రోజును శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ప్రారంభించేందుకు మన శరీరానికి శక్తి అవసరం. ఉదయం మనం తినే ఆహారమే దీనికి కారణం. కానీ మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్పర్ అయితే మీరు మీ శక్తిని ఎక్కడ నుండి పొందుతారు? ఫ్రెష్ గా ఎలా ఉంటారు.
ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోతే కోపం, చిరాకు, మలబద్ధకం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. భోజనం, తదుపరి భోజనం మధ్య ఎక్కువ విరామం తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అల్పాహారం దాటవేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్లు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. కొంతమంది బరువు తగ్గడానికి ఒక వ్యూహాత్మకంగా అల్పాహారం దాటవేస్తారు. కానీ ఉదయం వేగవంతమైన బరువు తగ్గడానికి దారితీయదని కూడా కనుగొన్నారు. అల్పాహారం దాటవేయడం వల్ల శరీరంలోని సూక్ష్మపోషకాలపై ప్రభావం పడుతుంది. రెండు పూటల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం తగ్గుతుంది. అంతే కాకుండా ఎసిడిటీతో పాటు రుతుక్రమం సరిగా లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అన్నింటికంటే ఇది హిమోగ్లోబిన్, బి 12, విటమిన్ డి లోపానికి దారితీస్తుందంటున్నారు.
అల్పాహారం తీసుకోకపోవడం చాలా అరుదుగా జరిగితే పర్వాలేదు. కానీ పూర్తిగా అల్పాహారం మానేయడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం అధిక రేట్లు ఉంటాయి. అయితే అల్పాహారం కోసం ప్యాక్ చేసిన ఆహారాల జోలికి వెళ్లకండి. అది ఇంకా ప్రమాదం. ఉదయాన్నే ఇంట్లో వండిన, పౌష్టికాహారం తినడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అల్పాహారం దాటవేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచివున్నదంట.