Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని రంగాల్లో రాణిస్తూ... ఇటు ఇంటా అటు బయటా ఎంతో కష్టపడుతున్నా మహిళల్ని వివక్ష అనే అస్త్రంతో భయపెట్టి ఓ మూలకు నెట్టాలనుకోవడం, న్యూనతను పెంచి పోషించడం ఈ పురుషాధిక్య సమాజంలో సర్వసాధారణం. ఇది ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉంది. మన వెనకబాటుకు అదీ ఒక కారణమంటే అతిశయం కాదు. ఇలాంటి పరిస్థితుల వల్లే 56 శాతం మంది మహిళలు ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇది 'విమెన్ ఎట్ వర్క్ 2022, ఎ గ్లోబల్ ఔట్లుక్' పేరుతో డెలాయిట్ న్యూస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భారత్ సహా పది దేశాలకు చెందిన ఐదు వేల మంది మహిళల మీద జరిపిన ఈ సర్వేలో 40 శాతం మంది చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరొకటి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మిగిలిన వారు అవకాశం కోసం చూస్తున్నామని చెప్పారు. అందుకు కారణాలు ఎంతో తెలుసుకుందాం...
లింగ వివక్షను ఎదుర్కొంటున్నాం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవమానాలు పడుతున్నాం. వివిధ సందర్భాల్లో 'పురుషుల సామర్థ్యం ముందు మీది తక్కువ' అంటూ గేలి చేస్తుంటారు.
పురుషులతో కలిసి ఫీల్డ్‌వర్క్ చేసినా, సుదూరాలు ప్రయాణించినా, రాత్రివేళల్లో పనిచేసినా మరేదో అసంతృప్తి వ్యక్తం చేసి అవమానిస్తుంటారు.
స్త్రీలకు సాధ్యం కాదనే నెపంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడానికి ఇష్టపడటం లేదు.
ఇంటి బాధ్యతలన్నిటినీ సమర్థంగా నిర్వహించే మేము కార్యాలయాల్లోనూ క్లిష్టమైన అంశాలనైనా చక్కబెట్టగలం. కానీ అలాంటి నమ్మకం చూపక మమ్మల్ని పక్కన పెడుతున్నారు.