Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్య, దిగువ తరగతి కుటుంబాల్లో తాము చదువుకోలేకపోయినా కనీసం పిల్లలనైనా విద్యా వంతులను చేయాలనుకుని కోరినవన్నీ అందిస్తారు. వాటి కోసం తామెంత శ్రమపడుతున్నామో తెలియనివ్వరు. దీంతో పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించరు. ఆ కష్టం విలువ తెలియకుండానే ఎదుగుతారు. అడిగిందల్లా అందిస్తుంటే అదే అలవాటుతో.. పెద్దైన తర్వాత కూడా ఇతరులపై ఆధారపడే స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉంది. దీనివల్ల పలు ఇబ్బందులెదుర్కొంటారు. అందుకే బాల్యం నుంచే కష్టం తెలిసేలా పెంచితే భవిష్యత్తులో ఎటువంటి సందర్భాన్నైనా దాటగలుగుతారు.
పిల్లలు తమకు బొమ్మలు, గేమ్స్ కావాలన్నప్పుడు వాటి కోసం వారికే పని చెప్పాలి. వారాంతంలో ఎంతో కొంత పాకెట్‌మనీ ఇస్తామని, పొదుపు చేయాల్సిన బాధ్యత వారిదేననాలి వివరంగా చెప్పాలి.
మూడు డిబ్బీల్లో ఇచ్చిన నగదును మూడు భాగాలుగా చేసి పొదుపు, ఖర్చు, పంచడం ఇలా విడిగా వేయమనాలి. డిబ్బీలో ఉన్న నగదుతోనే వాళ్లు కోరినవి కొనివ్వాలి.
పొదుపు దాంట్లో వేసిన వాటిని కంప్యూటర్, ల్యాప్ టాప్, సైకిల్ వంటి పెద్ద వస్తువుల కోసమని చెప్పాలి.
షేరింగ్ దాంట్లోది ఆరు నెలలకొకసారి ఎవరైనా పేద విద్యార్థికి పుస్తకాలు వంటివి కొనివ్వడానికి ఉపయోగించడం నేర్పించాలి. దీని వల్ల ప్రతి రూపాయి వెనుక కష్టంతోపాటు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడమెలాగో తెలుసుకుంటారు.