Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపకాంతుల పండుగ తనతో పాటుగా మహోన్నతమైన వేడుకలను కూడా తీసుకువస్తుంది. ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం అందిస్తుంది. దీపావళి పండుగను మనమంతా వైభవోపేతంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ గతానికంటే మరింత ఆప్రమప్తంగా ఈ క్షణాన వేడుక చేయడానికి మనమంతా లక్ష్యంగా చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన స్నాక్స్, మిఠాయిలను తయారుచేయడం, పర్యావరణ అనుకూల వేడుకలు చేయడం, ఇలా సానుకూల మార్పులను తీసుకువచ్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.
స్వీట్లు, స్నాక్స్ అన్ని పండుగల్లాగానే దీపావళిలోనూ అంతర్భాగంగా ఉంటాయి. బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ప్రియమైన వారి పట్ల చూపే ప్రేమ, కృతజ్ఞతకు సూచిక. ఈ సంవత్సరం ఈ భావనను మారుద్దాం. ఆరోగ్యవంతమైన స్నాక్స్. స్వీట్లు వైపు పయనిద్ధాం. చక్కటి ఆరోగ్యానికి ఉత్తమ బహుమతి బాదం.
బాదంలో 15 రకాల పోషకాలు ఉంటాయి. అందులో విటమిన్ ఈ, డైటరీ ఫైబర్, ప్రొటీన్, రిబోఫ్లావిన్, మాంగనీస్, ఫోలేట్ వంటివి ఉంటాయి. క్రమం తప్పకుండా బాదం తింటే గుండె, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా బాదంను ఆరోగ్యవంతమైన బహుమతిగా నిలుపుతున్నాయి. అంతేకాదు పోషక విలువలు తక్కువగా ఉండే స్వీట్లు, రుచులకు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా ఈ దీపావళి పండుగ వేళ నిలుస్తుంది. అందుకే ఈ దీపావళిని ఆలోచాత్మకంగా బాదంతో వేడుకచేయండి.