Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణం మారింది. ఈ కాలంలో జుట్టు తర్వగా నిర్జీవంగా కనిపిస్తుంది. కురులకు తగిన తేమ అంది పట్టు కుచ్చులా మెరవాలంటే గంజి వాడాల్సిందే. అదెలాగంటారా?
కప్పు గంజి, చెంచా నిమ్మరసం, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాయాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. ఈ మిశ్రమం కుదుళ్లను బలంగా మారుస్తుంది.
తరచూ బయట తిరిగే వారి జుట్టు కాలుష్య ప్రభావానికి గురి కాకుండా ఉండాలంటే గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట ఆరనివ్వండి. ఆపై తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కుదుళ్లు బలపడతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు... జుట్టుకి పోషణ అందించి నిగారింపుతో కనిపించేలా చేస్తాయి.