Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోషకాహారంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే.. ఆ ఆహారాన్ని తయారు చేసే వంటిల్లే అనారోగ్యాలకు నిలయమైతే.. ఆ కుటుంబం వ్యాధుల పాలవడం ఖాయం అంటున్నారు నిపుణులు. నివారణగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.
గిన్నెలు, పొయ్యి శుభ్రం చేసే స్క్రబ్‌లను రోజూ సబ్బు కరిగించిన వేడినీటిలో కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికి ఆరనివ్వాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి, వీటితో గిన్నెలు, ఆహారం కలుషితమవుతాయి. అనారోగ్యాలకు కారణమవుతాయి.
వంట పూర్తయ్యాక పొయ్యి చుట్టు పక్కల శుభ్రం చేయడం మరవ కూడదు.
ఫ్రిజ్‌ను రెండు మూడు వారాలకొకసారి తుడిచి శుభ్రం చేయాలి. కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూడటం తప్పని సరి. కనీసం నెలకొకసారి ఫ్రీజర్‌లో ఉంచిన పదార్థాల గడువు తేదీలను పరిశీలించాలి. గడువు ముగిస్తే బయట పడేయాలి. ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండు మూడు రోజుల కన్నా ఎక్కువగా ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు.