Authorization
Mon Jan 19, 2015 06:51 pm
75 సంవత్సరాల కిందట భారతి ఆశా సహారు చౌదరి తన రోజువారీ అనుభవాలను ఓ డైరీలో రాసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 17 ఏండ్లు కావొచ్చు. కానీ అసాధారణ కాలంలో జీవించిన యువతి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరారు. అప్పట్లో ఆమె రాసుకున్న ఆ వార్ డైరీని ఆమె మనవరాలు తన్వి శ్రీవాస్తవ హిందీ నుండి ఆంగ్లంలోకి అనువదించింది. ఆనాటి కష్ట సమయాల్లో ఆమె జీవితంలోని పోరాట ఘట్టాలను మనకు అందిస్తుంది. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
ఆశా తల్లిదండ్రులు ఆనంద్ మోహన్, సతీ సేన్ సహారు. ఇద్దరూ స్వాతంత్య్ర సమరయోధులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో సన్నిహితంగా ఉండేవారు. 1928లో జపాన్‌లోని కోబ్‌లో జన్మించిన ఆశా (జపాన్‌లో భారతి అని పిలుస్తారు) చిన్నతనం నుండే తన అనుభవాలను రాయడం ప్రారంభించారు. బాంబులు పడడం, కందకాలలో పడిపోవడం, తండ్రి, మామయ్య పాల్గొన స్వతంత్య్ర పోరాట దృశ్యాలను స్పష్టంగా తన డైరీలో పునఃసృష్టించారు. నేతాజీ అద్భుతమైన వ్యక్తిత్వం, 17 ఏండ్ల వయసులో రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరడం ఇలా ఎన్నో విషయాలను అందులో పొందుపరిచారు. కోబ్‌లో తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమె టోక్యోలోని ప్రసిద్ధ షోవా కోజా కళాశాల (ఇప్పుడు షోవా ఉమెన్స్ యూనివర్శిటీ)లో చేరారు.
యుద్ధ సమయంలో జీవితం
ఆమెది అనిశ్చితి జీవితం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుండి టోక్యో చేరుకున్నారు. తూర్పు ఆసియా అంతటా ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. తండ్రి, మామ సత్య సహారు అడుగుజాడల్లో ఆశా కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరారు. రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగారు. ''జపాన్‌లో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధులుగా వారు భారతీయులని, జపాన్ ప్రజలందరినీ సమీకరించారు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను. అక్కడ మేము స్వేచ్ఛ కోసం పోరాడటం నేర్చుకుంటాము. నా తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ నిజమైన దేశభక్తులుగా మార్చడానికి చాలా ఆసక్తిగా ఉండేవారు'' అంటే ప్రస్తుతం 94 ఏండ్ల ఆశా పాట్నా నుండి ఓ వెబ్ పత్రికతో మాట్లాడారు. అక్కడ ఆమె ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఉంటున్నారు.
సీరిస్‌గా ప్రచురించబడింది
1946లో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులతో పాటు ఓ హిందీ ప్రొఫెసర్ సహాయంతో డైరీలోని జపనీస్ వెర్షన్‌ను హిందీలోకి అనువదించారు. అది హిందీ పత్రిక ధర్మయుగ్‌లో సిరీస్‌గా ప్రచురించబడింది. ఇప్పుడు మనవరాలు తన్వి శ్రీవాస్తవ, మనవడు కలిసి ఆమె డైరీ విస్తృతంగా ప్రేక్షకులను చేరుకోవాలని ది వార్ డైరీ ఆఫ్ ఆషా-సాన్ (హార్పర్‌కాలిన్స్) అనే ఆంగ్ల పుస్తకంలోకి అనువదించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడిన ఒక యువతి ధైర్యాన్ని ఈ పుస్తకం హైలైట్ చేస్తుంది.
అప్పటి వరకు చదవలేదు
మహమ్మారి సమయంలో తన్వి తన ఇద్దరు చిన్న పిల్లలతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ సమమంలో సఫారీ కంపెనీకి వ్యాపారం లేకపోవడంతో పుస్తకాల అరలో ఉన్న డైరీ హిందీ వెర్షన్‌ను చూసింది. అప్పటి వరకు దాన్ని ఆమె చదవలేదు. ''నేను గత 10 ఏండ్లుగా ఆంగ్లంలో ఫిక్షన్ రాస్తున్నాను. కొన్ని చిన్న కథలను కూడా ప్రచురించాను. ఈ డైరీ చదవడం ప్రారంభించినప్పుడు దానిని అనువదించడం చాలా అవసరమని నా పని ప్రారంభించాను'' అని ఆమె చెప్పింది.
అర్థరాత్రి వరకు అనువాదం చేసేది
తన్వికి తండ్రి జీవితంతో పాటు డైరీల గురించి తెలుసు. హిందీ వెర్షన్ చదవడం ప్రారంభించిన తర్వాత ఆమె దానిని ఇష్టపడింది. తనను తాను ఒక గదిలో బంధించుకుని అర్థరాత్రి వరకు అనువాదం చేసేది. ఆమె తన మెంటర్షిప్ సెషన్లలో దాని గురించి మాట్లాడుతుంది. వారు దానిని పూర్తి చేయమని ఆమెను కోరారు. బంగ్లాదేశ్ గురువు సాద్ జెడ్ హుస్సేన్ దానిని భారతదేశంలోని ఒక సాహిత్య ఏజెంట్‌కు పంపితే అది అంగీకరించబడింది.
పూర్తి అనుమతి వచ్చింది
''కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని నేను గుర్తించలేదు. వయసు మీదపడడం, ఓ యువతి గొంతు వినడం నాకు బాగా కలిసొచ్చాయి'' అని తన్వి చెప్పింది. ఆశా తన డైరీల హిందీ వెర్షన్‌ను సవరించడానికి ఆమెకు పూర్తి అనుమతి ఇచ్చింది. తేదీలు, ఈవెంట్లు, కాలక్రమం, ఇతర సమాచారం గురించి తన్వి తరచుగా ఆమెతో క్రాస్ చెక్ చేసేది. తన్వి అనువాదం చేస్తున్నప్పుడు సంఘటనలు సజీవంగా వస్తున్నాయని ఆశా అంటుండేది.
నాకు కోపం వచ్చింది
''మేము పోరాట స్ఫూర్తితో నింపబడ్డాము. శత్రువును చూసి భయపడలేదు. అమెరికా విమానాలను జపనీయులు కూల్చివేసినప్పుడు మేము ఆనందంతో నృత్యం చేసాము. కాబట్టి నేను చేయవలసింది నేను చేయాల్సి వచ్చింది'' ఆమె తన డైరీలో చెప్పారు. ''పోరాడటానికి భయపడుతున్నావా అని నేతాజీ నన్ను అడిగినప్పుడు నాకు కోపం వచ్చింది. కానీ అతను మా అందరినీ ధైర్యానికి మారూ పేరుగా పిలిచాడు'' ఆమె జతచేస్తుంది.
అతని పాత్ర గొప్పది
నేతాజీ పట్ల ఎనలేని ప్రశంసలు డైరీలో ఉన్నాయి. ''ఆ సమయంలో అటువంటి కారణాన్ని కలిగి ఉండటం విముక్తి కలిగించేది. అన్నిటికంటే ఉన్నతమైన దాని కోసం పోరాడడం, భారతదేశం కోసం పోరాడడం. అదే నేటి ప్రపంచంలో అనూహ్యమైన పనులను చేయడానికి కుటుంబం శక్తిని కనుగొనేలా చేస్తుంది. అందులో నేతాజీది చాలా పెద్ద పాత్ర. అతని సందేశం అందరినీ ఆవరించేది. అందులో భారతదేశం గురించి తప్ప మరేమీ ఉండదు'' ఆమె చెప్పారు.
కష్టమైన జీవితాన్ని గడిపారు
ఆశా ఎల్.పి. చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత బొకారోలో ఏకాంత జీవితాన్ని గడిపారు. తర్వాత 20 సంవత్సరాల వరకు యుద్ధ సమయంలో తన జీవితం గురించి ఆమె ఏమీ మాట్లాడలేదు. 1973లో ఆమె తన డైరీని జపనీస్ నుండి హిందీలోకి అనువదించి ధర్మయుగ్‌లో ప్రచురించింది. తన కొడుకు చనిపోవడంతో కష్టతరమైన జీవితాన్ని గడిపారు. కొంత కాలానికి భర్త క్యాన్సర్‌తో మరణించాడు. 80వ దశకంలో ఆశా బోధ్ గయలోని జపనీస్ ఆశ్రమంలో పనిచేశారు. 90ల చివరలో, 2000వ దశకంలో మాత్రమే ఆమె రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో భాగమైనందుకు గుర్తింపు పొందడం ప్రారంభించింది.
దేశం మరోలా ఉండేది
ఆశా ఇప్పటికీ తాను చేయవలసినది చేసింది అని నమ్ముతుంది. చేయడానికి ఇంకేమీ లేదు. ''నేను నిద్రపోయే ముందు నా డైరీని రాసుకున్నాను. రోజులోని మంచి లేదా చెడు సంఘటనలను వివరించడానికి దీన్ని ఉపయోగించుకున్నాను. ఇది ఇతరులకు ప్రేరణగా ఉంటుందని నేను అనుకోలేదు. నేతాజీ మరో మూడు దశాబ్దాలు జీవించి ఉంటే భారతదేశం మరోలా ఉండేదా అని అడిగినప్పుడు నెహ్రూ, నేతాజి గొప్ప స్నేహితులు. కానీ వారి సిద్ధాంతాలు వేరు. సుభాష్ నేటి రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదని ఆమె చెప్పారు.
పోరాటానికి బయలుదేరుతుంది
''నాన్న స్వరం చాలా బలంగా ఉంది. అది కాలాన్ని దాటుతుంది. ఇది కేవలం చారిత్రాత్మక పత్రం మాత్రమే కాదు ఇది ఒక అమ్మాయి డైరీ. ఉదాహరణకు ఓ చిన్న సంఘటన... ఆమె ప్రాణ స్నేహితురాలు రైల్వే స్టేషన్లో ఎర్ర గులాబీని ఇస్తుంది. ఆమె తన కుటుంబం, స్నేహితులకు వీడ్కోలు పలుకుతోంది. తనకు తెలియని, ఎప్పుడూ సందర్శించని భారతదేశం కోసం పోరాడటానికి బయలుదేరుతోంది. ఆమె బూట్లలో మిమ్మల్ని మీరు ఉంచుకోవడం కష్టం. కానీ మీరు భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు'' ఆమె చెప్పింది.