Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీన కాలం నుండి సౌందర్య చికిత్సలో తేనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మ అందానికి సంబంధించిన సమస్యలన్నింటినీ తేనె ఒక్కటే పరిష్కరిస్తుంది. ఎండ వల్ల ముఖం నల్లబడడం మొదలుకుని, డల్ స్కిన్‌ని కాంతివంతంగా మార్చే శక్తి ఇందులో ఉంది.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. చర్మంలోని మురికి, జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది. ముందుగా నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తడిగా ఉన్న ముఖం, మెడపై పలుచని తేనెను రాసుకోవాలి. సుమారు 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.
కీరదోసకాయ రసాన్ని తేనెతో కలిపి ఒక సీసాలో ఉంచి ముఖం, మెడ భాగాలపై స్ప్రే చేసి దూదితో రుద్దండి.
ఒక గిన్నెలో తేనె, పంచదార పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తేమగా ఉన్న ముఖం అన్ని ప్రాంతాలలో అప్లై చేయండి. తర్వాత ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. 5 -10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
సగం అరటిపండు తీసుకుని ముక్కలుగా కోసి మెత్తగా పేస్ట్ చేయాలి. ముద్దలు లేకుండా మిశ్రమాన్ని సిద్ధం చేయండి. అందులో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.