Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేడివేడిగా ఉడికించిన స్వీట్‌కార్న్‌ని చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఇది రుచిలోనే కాదు... పోషకాల్లోనూ మేటే. తింటే కలిగే ప్రయోజనాలేంటే చూద్దాం.
బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారం స్వీట్‌కార్న్. కెలొరీలు తక్కువగా ఉండే ఇందులో డైటరీ ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లోని ఫెరులిక్ యాసిడ్ క్యాన్సర్‌కి అడ్డుకట్ట వేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా మీద పడకుండా నియంత్రిస్తుంది.
స్వీట్ కార్న్‌లోని పీచు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తే, మేలు చేసే బ్యాక్టీరియా జీవ క్రియల పనితీరుని మెరుగు పరుస్తుంది. ఇందులోని ఎ, బి విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. చురుకుదనాన్ని పెంచుతాయి. ఫోలేట్ గుండె సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది.
జియాక్సాంథిన్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ స్వీట్ కార్న్‌లో ఉంటుంది. ఇది కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.