Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాయిశ్చరైజర్ రాసి, ఫౌండేషన్ లేదా బేబీ క్రీమ్ రాయడానికి సమయం పడుతుంది కదా. దీనికి బదులుగా ఈ రెంటినీ కలిపి రాసేయండి. ముఖం డల్‌గా అనిపిస్తోంటే లిక్విడ్ హైలైటర్నీ కొన్ని చుక్కలు కలపొచ్చు. దాంతో ముఖం మెరుస్తుంది.
మచ్చలు, కండ్ల కింద నలుపు ఉన్నాయనిపిస్తే కన్సీలర్ వాడండి.
చలికాలమే కాబట్టి పౌడర్ మేకప్ పెద్దగా అవసరం ఉండదు. మరీ జిడ్డుగా అనిపిస్తోంటే గడ్డం, నుదురు, బుగ్గలకు కాంపాక్ట్ లేదా పౌడర్ మేకప్‌ను పైపైన అద్దితే సరిపోతుంది.
అందమైన కండ్ల మరింత అందంగా కనిపించాలంటే కాటుక తప్పనిసరి. కాజల్ పెన్సిల్ వాటర్ప్రూఫ్ది ఎంచుకొని కళ్లంతటా మరీ మందంగా కాకుండా పెడితే చాలు. ఇక తీరైన కనుబొమలకు ఐబ్రో పెన్సిల్ తప్పనిసరి. దీన్నే ఐలైనర్గానూ వాడేయండి. షేప్ రాలేదన్న కంగారు ఉండదు. కనురెప్పలకు తేలిగ్గా శుభ్రం చేయగల, వాటర్ ప్రూఫ్ మస్కారా వేస్తే లుక్ మారిపోతుంది.
నచ్చిన రంగు లిప్‌స్టిక్ లేదా లిప్‌గ్లాస్ వేసుకోండి. దీన్నే వేలిపై రాసి, బుగ్గలు, కనురెప్పలపై అద్దితే సరి. బ్లష్, ఐమేకప్ కూడా పూర్తయిపోతాయి.