Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిచెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వంట చేసేటపుడు ప్లాట్‌ఫామ్, ఫ్లోర్‌పై నీళ్లు పడి అక్కడంతా తడితడిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి తడిదనానికి వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్లు సులభంగా ఆకర్షితమవుతాయి. వండేటప్పుడు అవి మనకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతాయి. దాంతో మనకే నష్టం. కాబట్టి కిచెన్ ప్లాట్‌ఫామ్, ఫ్లోర్‌ను రోజూ డిస్-ఇన్ఫెక్టంట్ ద్రావణాలతో శుభ్రం చేయాలని చెబుతున్నారు నిపుణులు. దాంతో వంటగది నీట్‌గా ఉండడంతో పాటు సూక్ష్మక్రిముల బెడద ఉండదు.
టైంపాస్ కోసమంటూ వివిధ రకాల ప్యాక్డ్ ఫుడ్స్ తెచ్చుకొని వంటింట్లో భద్రపరచుకుంటుంటారు చాలామంది. నిజానికి వీటివల్ల ఆరోగ్యానికి హాని తప్ప మరే ప్రయోజనం ఉండదు. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటే పండ్లు, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినాలన్న ఆలోచనే రాదంటున్నారు నిపుణులు. అందుకే వాటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తయారుచేసుకొని నిల్వ చేసుకోవడం మంచిదంటున్నారు.
మాంసాహారం, చేపలు.. వంటివి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపై ఓ మూత పెట్టి అలాగే వదిలేస్తుంటారు చాలామంది. అయితే దీనివల్ల వాటిలోని జ్యూసులు ఆవిరైపోయి.. అవి మరింత పొడిగా అయిపోతాయట. దాంతో రుచీ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రై చేశాక వాటిపై నుంచి సిల్వర్ ఫాయిల్ పేపర్‌తో కవర్ చేస్తే ఈ సమస్య ఉండదు.
టైం లేదంటూ బ్రేక్‌ఫాస్ట్ బయటే తినేయడం, ఇంటికొచ్చేటప్పుడు డిన్నర్ బయటి నుంచి తెచ్చుకోవడం లేదంటే ఆన్లైన్లో ఆర్డరివ్వడం వంటివి చాలామందికి అలవాటు. ఇది అకేషనల్‌గా అయితే పర్లేదు.. అంతేకానీ రోజూ ఇలా తింటే మాత్రం లేనిపోని అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. కాబట్టి కాస్త వీలు చూసుకొని ఇంట్లోనే వండుకోవడం ఉత్తమం.
వంట చేసేటపుడు ఇలాంటివన్నీ దాదాపుగా అందరూ చేసే పొరపాట్లే. కాబట్టి ఇకనుంచైనా ఇవి పునరావృతం కాకుండా చూసుకుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.