Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడాది పొడవునా సులభంగా లభించే పండు అరటి పండు. ఇది మీ చర్మం, జుట్టుకు మంచి ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ.. శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది. అరటిపండు గుజ్జును తేనెతో మిక్స్ చేసి.. మీ ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ చర్మం మదువుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జుతో మీ జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. షాంపూలు, కండీషనర్లతో సహా సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడంలో అరటిపండును కచ్చితంగా ఉపయోగిస్తారు.