Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీరియడ్స్ సమయంలో యోని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఇన్ఫెక్షన్ బారిన పడతారు. దీనికి ప్రధాన కారణం పరిశుభ్రత లోపమే. కొద్దిపాటి అజాగ్రత్త, సరైన సమాచారం లేకపోవడం వల్ల.. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. యోని ఇన్ఫెక్షన్ సంభవించినట్లయితే.. మీరు సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే అది మరింత తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలకు కూడా దారి తీయవచ్చు. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే.. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో నిరంతరం తడిగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్యాడ్ తరచుగా మార్చుకోవాలి. దీనివల్ల ఈ అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది.
మురికి చేతులతో ఎప్పుడూ ప్యాడ్‌ని టచ్ చేయకండి. ధరించేటప్పుడు, తొలగించేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
మీ లో దుస్తులను ఎల్లప్పుడూ ఎండలోనే ఆరబెట్టాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఉపయోగించిన వాటిని పూర్తిగా డ్రై అయ్యేలా చూడండి. ఇది బ్యాక్టీరియా సంక్రమణ అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది.
ఈ రోజుల్లో చాలా రకాల ఇంటిమేట్ వాష్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించండి. కొందరు సబ్బు వాడుతూ ఉంటారు. దీనివల్ల సహజ పీహెచ్ స్థాయికి భంగం కలుగుతుంది.
పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవి మురికిగా అనిపిస్తే.. టాయిలెట్ స్ప్రేని ఉపయోగించండి.
ఆఫీసు, కాలేజీ లేదా మాల్లో బాత్రూమ్ని ఉపయోగించే ముందు ఫ్లష్ చేయండి.
ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు మీ పీరియడ్స్ ముగిసిన తర్వాత మీ బెడ్‌షీట్, ఇతర వస్తువులను మార్చేయండి.
అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా.. మీకు ఏదైనా నీరసం లేదా దురద అనిపిస్తే.. వెంటనే మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లండి.