Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్న జరిగిన తప్పు గురించి తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకోవడంలో ఓ అర్థముంది. కానీ.. నిన్న జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ లేదా చెడు గురించి ఆలోచిస్తూ బాధ పడడంలో అర్థం లేదు. నిన్న గురించి బాధపడుతూ ఈరోజును కోల్పోతున్నారంటే.. దాని కంటే పెద్ద తప్పు మరేది ఉండదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. కష్టం, సుఖాలు ఉండడం కామనే. అలాగే మీకు నిన్న సరిగ్గా ఉండకపోవచ్చు. మీరు చెడు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. కానీ మీరు అన్ని విషయాలు పక్కన పెట్టి.. జరిగిన నిన్న గురించి ఆలోచిస్తూ.. ఎక్కి ఎక్కి ఏడుస్తూ.. ఆశలన్నీ కోల్పోయి.. చింతించడం సరికాదు. రేపటి గురించి ఆలోచించకపోయినా పర్లేదు కానీ.. ఈ క్షణాన్ని ఎంజారు చేయకపోవడం తప్పే. ప్రతి క్షణం ఎంజారు చేయాలని అర్థం కాదు. కానీ మార్చలేని వాటి గురించి బాధ పడి ఈరోజు చేయాల్సిన వాటిని గాలికొదిలేయడం కరెక్ట్ కాదు అని అర్థం.
గడిచిపోయిన వాటి గురించి.. గడిచిన రోజులు గురించి ఏడుస్తూ ఉండడం తెలివైన పని కాదు. కానీ మీరు రేపటి మీద దష్టి పెట్టవచ్చు. నిన్న బాలేదు కాబట్టి.. ఈరోజు బాగోకూడదు.. రేపు బాగోకూడదు అనుకోరు కదా. నిన్న బాలేదు కాబట్టి.. రేపైనా బాగుండాలి అనుకోవాలి. అలా బాగుండాలి అంటే నిన్న జరిగిన దాని గురించి బాధపడకుండా.. రేపటి కోసం ఈరోజు కష్టపడాలి. మీ గతం మిమ్మల్ని వెంటాడి పీక్కూని తింటుందంటే.. మీరు దాని గురించి ఎక్కుల ఆలోచించి వర్రీ అవుతున్నారని అర్థం.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ గతాన్ని మార్చే అవకాశం మీకు లేదు. కానీ.. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. అంతేకానీ దాని గురించి బాధపడుతూ కూర్చుంటే.. ఈరోజు.. ఈ క్షణం మీకోసం ఆగుతుందా? మన చేతుల్లో లేని గతం గురించి ఆలోచిస్తూ.. ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న రోజు గురించి మీరు ఆలోచించడం మంచిది. లేదంటే తర్వాత మీరే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అయ్యో చేజేతులా.. నా అందమైన రోజుని పాడు చేసుకున్నానే అనిపిస్తుంది.
మీరు గతంలో చేదు అనుభవాలు కలిగి ఉన్నంత మాత్రానా రోజు ఏడ్వాలని రూల్ లేదు. అలా ఏడ్చినంత మాత్రనా ఏమైనా మారుతుందా అంటే అది లేదు. ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. గతాన్ని వదిలేయడం. కొన్నిసార్లు మీ సొంత ప్రాధన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈరోజును మరింత మెరుగ్గా మార్చుకోవాలంటే.. తప్పుల నుంచి నేర్చుకోవాలో తప్పా.. వాటిలో కంగిపోయి బాధపడకూడదు. గతమనేది ఎప్పుడూ ఒత్తిడి, బాధ, కోపం, చిరాకునే ఇస్తుంది తప్పా.. మీకు విశ్రాంతినివ్వదు. అలాంటి గతం మీకుంటే చింతించకండి. మీ భవిష్యత్తును గుర్తించడం మీకు ముఖ్యం. మీ వర్తమానం మీకు మెరుగ్గా ఉండాలంటే.. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా నమ్మడానికి ప్రయత్నించండి. ఎవరికోసమో.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. మీరోజు నాశనం చేసుకోకండి. మీ చేతుల్లో ఉంది ఈరోజు మాత్రమే.