Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో పెదాలు పొడిబారడం చాలామందిలో తలెత్తే సమస్య. దాంతో అధరాలు నల్లగా మారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. మరి వీటికి తిరిగి జీవం పోయడం కొన్ని సహజసిద్ధమైన ప్యాక్స్తోనే సాధ్యమంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...
తేనెతో కోమలంగా: పెదాలు ఎర్రగా, మృదువుగా, కోమలంగా మారేందుకు తేనె ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అరటీస్పూన్ దానిమ్మ రసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే సరి. ఇలా తరచూ చేస్తుంటే కోమలమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇందులో తేనె చర్మానికి తేమను అందించి వాటిని సుతిమెత్తగా మారిస్తే దానిమ్మ రసం పెదాలకు మంచి రంగును తెచ్చిపెడుతుంది.
నిమ్మరసంతో: టీస్పూన్ చొప్పున నిమ్మరసం, తేనె తీసుకొని అందులో అరటీస్పూన్ ఆముదం వేసి పెదాలకు అప్త్లె చేసుకోవాలి. నిమ్మరసం బ్లీచ్‌లా పనిచేస్తే.. తేనె, ఆముదం చర్మానికి తేమనందిస్తాయి. కాబట్టి పెదాలు చక్కటి రంగుతో, మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి.