Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని సందర్భాల్లో మెడ పట్టినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాస్త పక్కకి తిరిగి పడుకొందామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా నిద్రపోవాలో తెలుసా? మెడ కండరాలు, ఎముకలకు సపోర్టు ఇచ్చే విధంగా పడుకోవాలి. దానికోసం తలకింద మెత్తని తలగడ వేసుకొని వెల్లకిలా నిద్రపోవాలి. పక్కకి తిరిగి నిద్రపోవాలనుకొంటే.. టవల్ను గుండ్రంగా చుట్టి మెడకింద పెట్టుకోవడం ద్వారా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు గుండ్రంగా చుట్టిన టవల్ మరీ పెద్దదిగా లేకుండా, తలగడకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవడం ముఖ్యం.