Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త చెప్పులు లేదా షూస్ వేసుకున్నప్పుడు వాటి రాపిడికి అక్కడక్కడా పాదాలపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం మనకు అనుభవమే. అలాంటి సందర్భాల్లో మళ్లీ వాటిని వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలా జరగకూడదంటే ఆయా భాగాలపై కాటన్ బాల్స్ ఉంచి.. చెప్పులు లేదా షూస్ వేసుకోవడం మంచిది.
పిల్లలు డ్రాయింగ్ వేసేటపుడు వారి చేతులపై మార్కర్ మరకలు పడుతుంటాయి. అవి మామూలుగా కడిగితే ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు పాలల్లో ముంచిన కాటన్ బాల్‌తో మరకలు పడిన చోట రుద్దితే ఇట్టే వదిలిపోతాయి.
ఎండ వేడికి చర్మం కందిపోయి మంట పుడుతుంది. అలాంటప్పుడు యాపిల్ సిడార్ వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో సమస్య ఉన్న చోట రాస్తే మంట తగ్గి చల్లబడుతుంది.