Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం వచ్చిందంటే మోరంగడ్డలు ఎంచక్కా పలకరిస్తాయి. ఇవి బీట్రూట్, ఆలూలాగా ఏడాది పొడుగునా కనిపించవు కనుక దొరికినప్పుడే తరచుగా తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని యథాతథంగానైనా, ఉడకబెట్టి తిన్నా బావుంటాయి. అందుకే వీటిని ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఇవి రుచికే కాదండోరు ఆరోగ్యానికీ మంచివే. వీటిల్లో ఎన్ని పోషకాలున్నాయో, ఎంత ప్రయోజనకరమో మీరే చూడండి...
ప్రొటీన్లు, పీచు, ఖనిజాలు, విటమిన్లు, మాంగనీస్, కాపర్, పొటాషియం తదితరాలుడటం వల్ల ఇవి మంచి పోషకాహారం. రోగనిరోధకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది.
వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు సూక్ష్మ క్రిములను హరింపచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. ఎ-విటమిన్ చూపును మెరుగుపరిస్తే, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు మెదడుకు మేలు చేస్తాయి.
మోరంగడ్డల్లో యాంథోసియానిన్స్ ఉన్నందున కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధిస్తాయని ఎలుకల మీద జరిపిన ప్రయోగాలు నిరూపించాయి.
ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని సమతులం చేస్తాయి. గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు.
అన్నిటి కంటే ముఖ్యంగా యాంటీ ఏజెనింగ్ క్రీములు వాడనవసరం లేకుండా ఈ సీజన్లో వీటిని తింటే సరిపోతుంది. చర్మం ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది.
వీటితో కూర, వేపుడు, పచ్చడి చేసుకోవచ్చు... సాంబార్లో వేయొచ్చు... ఇవి చాలా మందికి తెలిసినవే. అయితే వీటితో ఆలూకు మల్లే చిప్స్, ఫ్రైస్, టోస్ట్ తదితర చిరుతిళ్లు కూడా చేసుకోవచ్చు.