Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసవం తర్వాత కాస్త విరామం తీసుకుని... కెరియర్‌లోకి అడుగు పెట్టాలనుకునే అమ్మలు చాలామందే. ఈ గ్యాప్ కొన్ని సార్లు ఆత్మన్యూనతను కలిగిస్తుంది. తిరిగి నిలదొక్కుకోగలమో లేదో అన్న భయాన్ని పెంచుతుంది. ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాలో సూచిస్తున్నారు నిపుణులు.
గతంలో చాలా ఇంటర్వ్యూలకు హాజరై ఉండి ఉంటారు. కానీ, ఇదే మీ మొదటి ఇంటర్వ్యూ అనుకోండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండి. అవసరమైతే నిపుణుల సాయంతో శిక్షణ తీసుకోండి. సీనియర్ల సలహాలూ స్వీకరించండి.
ఒక్క ఉద్యోగం కోసం వందలాది మంది రావొచ్చు. అంత మందిలో మీ ప్రత్యేకత తెలిసేదెలా? అందుకే ఉద్యోగ ప్రయత్నాల కంటే ముందే మీ నైపుణ్యాలను సరి చూసుకోండి. అప్‌టుడేట్‌గా ఉండటానికి కొత్త ఉద్యోగానికి కావలసిన అదనపు అరÛతలపై పట్టు తెచ్చుకోండి. ఇందుకు అవసరమైన శిక్షణ తీసుకోవడమో లేదా కోర్సులో చేస్తే మరీ మంచిది. వాటిని రెజ్యుమె లో ప్రత్యేకంగా ప్రస్తావించండి. అప్పుడు మీరే మాత్రం భయం లేకుండా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించొచ్చు.;
కొంత విరామం తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు ఆందోళన సహజమే. అలాగని ప్రయత్నించకుండా భయపడటం అనవసరం. మీ గత విజయాలను గుర్తుతెచ్చుకోండి. భవిష్యత్తులో బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే ఉద్యోగం చేయాల్సి రావొచ్చు. అందుకు మీరేవిధంగా సన్నద్ధమయ్యారో, సమన్వయం చేసుకోగలరో కూడా చెప్పాల్సి రావొచ్చు. కాబట్టి వాటన్నింటికీ సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పగలిగితే వెనకడుగు వేయనక్కర్లేదు.