Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదడుని స్తబ్దుగా మార్చే కాలమిది! దీనికితోడు చర్మం నిర్జీవంగా తయారవుతుంది. పొడిబారి.. దద్దుర్లు, దురద, ఎర్రబడటం వంటివెన్నో! వాటన్నింటికీ బాత్ సాల్ట్‌తో చెక్ పెట్టేయొచ్చట.
గోరువెచ్చని నీటిలో బాత్‌సాల్ట్ రెండు స్పూన్లు కలిపి స్నానం చేయండి. ఇది శరీరానికి డీటాక్సింగ్‌గా పనిచేస్తుందట. చర్మంలో మలినాలు పోయేలా చేయడంతోపాటు శరీరానికి విశ్రాంతి భావననీ అందిస్తాయి.
చర్మంపై మృతకణాలను తొలగించి, మృదువుగా మారుస్తుంది. ఈ కాలం చర్మం పొడిబారి దురదకు కారణమవుతుంది. అది ఈ స్నానంతో తగ్గుతుంది. ఎగ్జిమా, సొరియాసిస్ వంటి లక్షణాలు కనిపిస్తున్నవారికీ;;దీంతో ఉపశమనం కలుగుతుందట. శరీరమంతా నొప్పులుగా అనిపిస్తున్నా ఈ స్నానం చేసేయండి. బాత్ సాల్ట్ వాటితోపాటు తలనొప్పినీ దూరం చేయగలదు.
అలసట, ఒత్తిడి అనిపించినప్పుడు ఎప్సమ్ సాల్ట్‌ను వేడి నీటిలో కలిపి, స్నానం చేసేయండి. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం మెదడు నుంచి సెరటోనిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. అంత సమయం లేదంటే ఆ నీటిలో పాదాలను ఐదు నిమిషాలు నానబెట్టినా రిలాక్స్ అయిన భావన కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి సమస్యలున్న వారికీ ఇది మంచి చికిత్స.