Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముప్పై ఏండ్లు వచ్చేసరికే ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు. అందుకే ముందు నుంచీ చర్మంపై దృష్టిపెడుతున్న వారెందరో. మరి ఫలితం దక్కుతోందా? ఈ ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు. అందుకే.. రోజూ క్రీములను రాస్తూ పోవడం కాదు... స్కిన్ సైక్లింగ్‌ను అనుసరించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటిది?
చర్మతీరుకు తగిన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నచ్చిన స్క్రబ్‌ను ఎంచుకొని అయిదు నిమిషాలపాటు ముఖాన్ని రుద్దాలి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిపోయాక మాయిశ్చరైజర్ రాస్తే సరి. చర్మంలోని మృతకణాలే కాదు.. పేరుకున్న అవశేషాలూ తొలగిపోతాయి.
రెండో రోజు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొని తడిపూర్తిగా పోయేదాకా ఆగాలి. ఆపై విటమిన్ ఎ పుష్కలంగా ఉండే రెటినాయిడ్ సీరమ్ లేదా క్రీమ్ రాయాలి. మొదటిసారి రాసేవారికి చర్మం ఎర్రబడటం, సన్నటి మొటిమలూ రావొచ్చు. అలాంటప్పుడు కాస్త మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. ఇది మొటిమల తాలూకు మచ్చలు, ముడతలు, గీతలు వంటివాటినన్నింటినీ తొలగిస్తుంది.
మూడు, నాలుగు రోజులను రికవరీ అని పిలుస్తాం. ఈ రెండు రోజులూ ముఖాన్ని శుభ్రం చేశాక కేవలం మాయిశ్చరైజర్‌నే రాస్తాం. ఇది చర్మానికి తేమతోపాటు పోషణనీ ఇస్తుంది. తర్వాత ఈ సైకిల్‌ను తిరిగి కొనసాగిస్తే సరి. ఎంత మన్నికైన ఉత్పత్తులైనా రోజూ రాసుకుంటూ వెళితే చర్మరంధ్రాల్లో పేరుకునే అవకాశాలెక్కువ. ఫలితమే దుష్ప్రభావాలు. అలా మితి మీరొద్దనే ఈ పద్ధతి.