Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయాలు సాధించడానికి ఆడా మగా తేడా లేదని, పరిమితులు అంతకంటే లేవని మహిళలు రుజువు చేస్తూనే ఉన్నారు. మూస పద్ధతులను ఛేదించుకుంటూ, అడ్డంకులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఏ స్త్రీ వెళ్లలేని చోటికి సైతం వెళుతున్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ విభిన్న రంగాలలో మార్గదర్శకులు అయ్యారు. దేనికీ తలవంచని తత్వం, కఠోరమైన శ్రమ, పట్టుదల ఇవే వారిని ఈ స్థాయికి చేర్చుతున్నాయి. వయసు, సామాజిక అడ్డంకులను సైతం ఎదిరిస్తున్నారు. అలా విజయాలు సాధించిన ఐదుగురు మహిళల గురించి ఈ రోజు తెలుసుకుందాం. వారి నుండి స్ఫూర్తి పొందుదాం...
సనోబర్ పర్దివాలా, స్టంట్ ఉమెన్
బాలీవుడ్ చరిత్రలో మొదటి స్టంట్ ఉమెన్‌గా ప్రసిద్ధి చెందిన సనోబర్ పర్దివాలా చాలా చిన్న వయసులోనే నక్షత్ర డైమండ్స్ ప్రకటనలో ఐశ్వర్య రారుకు డూప్‌గా నటించారు. దాంతోనే ఆమె కెరీర్‌ను ప్రారంభమయింది. సనోబర్ పాఠశాల విద్య పూర్తి చేసే సమయానికి 40 సినిమాల్లో స్టంట్ డబుల్‌గా పనిచేసింది. భూత్కి 15 ఏండ్ల వయసులో 16వ అంతస్తు నుండి దూకడం నుండి హీరో: ది లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై కోసం ఒక పెద్ద బాంబు పేలుడు సీక్వెన్స్‌లో భాగం అయ్యారు. రావణ్ కోసం కొండపై నుండి పడిపోవడం దగ్గర నుండి ఇటీవల నీటి అడుగున సన్నివేశంలో కూడా ఉంది. కొన్ని సంవత్సరాల కిందటి వరకు సనోబర్ 'స్టంట్‌మ్యాన్ కో బులావో' (స్టంట్‌మ్యాన్‌ని పిలవండి) అని వినడానికి అలవాటు పడింది. అంటే ఆమె మహిళ అయినప్పటికి పిలవడం మాత్రం స్టంట్‌మ్యాన్ అనే పిలిచేవారు. ఆమె దాన్ని సరిదిద్దడం కోసం ఎంతో కృషి చేసింది. 'మీరు నన్ను స్టంట్వుమన్ అని పిలవండి' అనే పదేపదే చెబుతుండేవారు. అందరూ దీన్ని అంగీకరించి, అవగాహన రావడానికి కొంత సమయం పట్టింది. చివరకు ఆమె స్టంట్వుమెన్గా పిలవబడుతుంది. దీనికి ఆమె ఎంతో సంతోషంగా ఉంది.
లూయిస్ రెమెడియోస్
లూయిస్ రెమెడియోస్ గోవాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తున్నప్పుడు పాములు, ఇతర జంతువులను రక్షించడంలో ప్రసిద్ధి చెందిన బెన్హైల్ అంటావో అనే వన్యప్రాణుల సంరక్షకుని ప్రదర్శనకు హాజరయ్యారు. అప్పటి నుండి ఆమె కూడా వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖతో కలిసి పనిచేశారు. నేషనల్ జియోగ్రాఫిక్లోని గోవాస్ వైల్డ్స్ట్లో పాములను, ఇతర జంతువులను రక్షించి బెన్-లూయిస్ ద్వయంలో సగం మందితో కలిసి పని చేస్తుందని ఎప్పుడూ ఆమె ఊహించలేదు. తాను చేస్తున్న ఉద్యోగం చాలా ప్రమాదాలతో నిండి ఉంటుంది. లూయిస్ చాలాసార్లు విషం లేని పాములచే కాటుకు గురైంది. కానీ బెన్‌తో కలిసి పనిచేసిన గత 10 సంవత్సరాలు చిరస్మరణీయ అనుభవాలతో నిండిపోయాయని ఆమె చెబుతున్నారు.
పుష్పా భట్, అల్ట్రా-మారథాన్ రన్నర్
తన 66 సంవత్సరాల వయసులో పుష్పా భట్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 9న సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తులో 72-కిమీల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అల్ట్రామారథాన్ ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌ని పూర్తి చేశారు. మూడు సంవత్సరాల కిందట ఆమె మొదటి మూడు స్ట్రెచ్‌లను సకాలంలో పూర్తి చేసినప్పటికీ నాలుగు నిమిషాల కట్-ఆఫ్‌ను కోల్పోయింది. కౌంట్‌డౌన్‌లో తప్పుడు లెక్కింపు కారణంగా ఆమె చివరి స్ట్రెచ్‌లో ఓడిపోయింది. రెండు దశాబ్దాల పాటు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన తర్వాత పుష్ప ఒక వ్యవస్థాపకురాలిగా మారారు. L'Oreal సెలూన్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టారు. మహమ్మారి సమయంలో 65 సంవత్సరాల వయసులో క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కావడానికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ఒక కోర్సు చేశారు. విస్తృతంగా ప్రయాణించే ఆమె కవితలు కూడా రాస్తారు. లడఖ్ మారథాన్‌లో ఆమె మొదటి ప్రయత్నం రన్నర్స్ ట్రైబ్ అనే సంకలనంలో ప్రచురించబడింది.
జాయ్సీ లింగ్డో, ట్రక్ డ్రైవర్
మేఘాలయకు చెందిన ముప్పై ఐదేండ్ల జాయ్సీ లింగ్డోV్‌ా భారతదేశంలో అమెజాన్ ట్రక్కింగ్తో భాగస్వామి అయిన మొదటి మహిళా ట్రక్ డ్రైవర్. ఆరు సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలు ఈమె. జాయ్సీ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ట్రక్ డ్రైవర్‌గా మారారు. మొదట ఆమె పాఠశాల బస్సును నడపడం ప్రారంభించింది. నగరంలోని అనేక చోట్ల పార్ట్ టైమ్ డ్రైవర్‌గా కూడా పని చేశారు. తర్వాత అమెజాన్ ట్రక్కింగ్ భాగస్వామి డ్రైవర్‌గా నమోదు చేసుకుని అందులో ఎంపికయ్యారు. ఆమె ఇప్పుడు గౌహతి చుట్టుపక్కల ప్రాంతాలకు డెలివరీలు చేస్తున్న అమెజాన్ ట్రక్ డ్రైవర్లలో ఒకరు. ''నాకు రోడ్డు మీద ప్రయాణం చేయడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం, కొత్త వ్యక్తులను కలవడం చాలా ఇష్టం. ఈ అవకాశం స్వయం సమృద్ధితో జీవించాలనే నా అభిరుచిని కొనసాగించడానికి నన్ను ప్రేరేపించింది. డ్రైవింగ్‌ను వృత్తిగా కొనసాగించాలనుకునే మహిళలకు నా సలహా ఏమిటంటే, మిమ్మల్ని మీరు విశ్వసిస్తే మీకు కొత్త అవకాశాలు స్వాగతం పలుకుతాయి'' అని ఆమె ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సిల్వా స్టోరై, జాకీ
ప్రపంచంలో రెండు డెర్బీలు గెలిచిన ఏకైక మహిళా జాకీ సిల్వా స్టోరారు. ఆమె బెంగుళూరులోని ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్‌కు, భారతదేశపు ప్రధాన ఈక్వెస్ట్రియన్ పాఠశాలల్లో ఒకటైన దానికి అధిపతిగా ఉన్నారు. ఇటలీలో జన్మించిన భారతీయ జాకీ సిల్వా స్టోరారు 1993లో వృత్తిపరంగా రేసింగ్‌ను ప్రారంభించారు. 1996 నుండి ఒక ప్రీమియర్ ఈక్వెస్ట్రియన్ పాఠశాల రూపకల్పన, నిర్వహణతో పాటు సిల్వా ఒక దశాబ్దం కిందట భారతదేశంలో ఈక్వెస్ట్రియన్ ప్రీమియర్ లీగ్ (EPL) భావనకు కూడా బాధ్యత వహించారు. మహమ్మారి నుండి దాని క్లబ్‌ల సంఖ్య 20కి పైగా పెరిగింది.