Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర సమతుల్యత శరీరానికే కాదు మొత్తం మనసుకు కూడా అవసరం. నిద్ర అవసరం ఒక్కొక్కరికి భిన్నంగా ఉండవచ్చు. కానీ సాధారణంగా 7-8 గంటల నిద్ర మంచిగా పరిగణిస్తాం. కానీ చాలా సార్లు ఉద్యోగం, కుటుంబం లేదా ఇతర బాధ్యతల కారణంగా తెల్లవారుజామున నిద్రలేవాల్సి ఉంటుంది. అలాంటి వారు కచ్చితంగా మధ్యాహ్న నిద్రకు ప్రాధన్యం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. అయితే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమందికి మధ్యాహ్నం పూట చిన్న నిద్ర కూడా చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
శరీరానికే కాదు ఈ చిన్న నిద్ర మీ మైండ్‌ని కూడా రిలాక్స్ చేస్తుంది. పగటిపూట దాదాపు గంట నిద్రపోవడం వల్ల శరీరం మొత్తం కండరాలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిద్రతో శరీరం, మనసు విశ్రాంతి పొందుతాయి. మీరు రిఫ్రెష్‌గా మేల్కొంటారు.
చాలా సార్లు ప్రయాణం చేసిన తర్వాత లేదా రాత్రి పార్టీ నుంచి.. ఇంటికి ఆలస్యంగా వచ్చిన తర్వాత.. మీ నిద్రకు భంగం కలుగుతుంది. ఈ సమయంలో మధ్యాహ్నం నిద్ర.. మీ అలసటను తొలగించడానికి పని చేస్తుంది. పగటిపూట నిద్రపోయే అలవాటు ఉన్నవారు.. ముఖ్యంగా గృహిణులు.. పొద్దున్నే లేచి ఇంటి పనులు చూసుకోవడం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడం వెనుక పెద్ద కారణం ఉంది. వాళ్లకి అంత శక్తి మధ్యాహ్నాం తీసుకునే నిద్రవల్లే సాధ్యమంటున్నాయి పలు అధ్యయనాలు.
వారి దినచర్య గడియారం ప్రకారం నడుస్తుంది. ఉదాహరణకు ఉదయాన్నే పనికి వెళ్లే వ్యక్తులు లేదా ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు.. మధ్యాహ్న నిద్ర వారిలో చురుకుదనాన్ని పెంచుతుంది.
నిద్రలేకపోతే చిరాకు, మూడ్ స్వింగ్, ప్రవర్తనలో మార్పులు వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే పగటిపూట కునుకు తీసే వారి మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. లేదంటే తలనొప్పి వచ్చే అవకాశముంది.
ఈ చిన్నపాటి నిద్ర జ్ఞాపకశక్తిపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా శీఘ్ర నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ప్రతిదీ చేయగల సామర్థ్యంపై కూడా ఇది మంచి ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మధ్యాహ్న నిద్ర ప్రభావం పిల్లల్లో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొద్దున్నే లేచి బడికి వెళ్లే పిల్లలు.