Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మచ్చలేని సౌందర్యాన్ని సొంతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ సౌందర్య ఉత్పత్తులే కాదు.. సహజసిద్ధమైన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. మన ఇంట్లో ఉండే తులసి ఆకులు కూడా ఇదే కోవకు వస్తాయంటున్నారు నిపుణులు.
తాజా తులసి ఆకులను తినడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తాజా ఆకులను మెత్తగా చేసుకొని మొటిమలపై రాసినా ఫలితం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో ఉడికించి చల్లార్చి ఆ ద్రావణాన్ని టోనర్‌గా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గడమే కాదు ముఖచర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది. తులసి పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా తులసి ఆకుల రసానికి పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.