Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనాల్ రామ్రాఖియాని.... మహిళలు తమపై తాము విధించుకున్న ఆంక్షలు... సమర్థవంతంగా పని చేయగల పరిమితుల నుండి పుట్టాయని ఆమె నమ్ముతున్నారు. వ్యాపారంలో 17 సంవత్సరాల అనుభవం ఉంది. ఉత్తర అమెరికా ఆటోమోటివ్ పరిశ్రమలో అగ్రశ్రేణి 100 మంది మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. అమెరికాలోని మిచిగాన్‌లోని టాటా టెక్నాలజీస్‌లో సేల్స్, గ్లోబల్ ఆటోమోటివ్ నాన్ క్యాప్టివ్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం గ్లోబల్ ఆటో వర్టికల్‌కు అధిపతిగా ఉన్నారు. టాటా టెక్నాలజీస్ కంటే ముందు ఆమె ఐటీ అవుట్సోర్సింగ్ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో అనేక కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు టాటా టెలిసర్వీసెస్, వాచ్ అండ్ జ్యువెలరీ మేకర్ టైటాన్ ఇండిస్టీస్ కోసం కూడా పనిచేశారు. నిర్వహణ పట్ల మక్కువ ఉన్న వ్యక్తిగా ఆమె టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అయిన టీఏఎస్ (గతంలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్)లో భాగంగా ఉన్నారు. సీనియర్ టాటా బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ (టీబీఈఎం) మదింపుదారు కూడా. టాటా కంపెనీల అనేక అసెస్మెంట్లకు నాయకత్వం వహించారు. బయోకెమిస్ట్రీలో బీఎస్సీ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన ఆమె నాయకత్వంలో మహిళల పాత్ర గురించి ఏమంటున్నారో చూద్దాం...
మీ కెరీర్‌లోని ముఖ్యాంశాలు?
నేను ఎప్పుడూ కెరీర్‌పై దృష్టిపెడతాను. మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో టీఏఎస్ (టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)కి ఎంపిక కావడం నాకు మంచి అవకాశం. టీఏఎస్ అనేది టాటా గ్రూప్ వారి ఫ్లాగ్షిప్ లీడర్షిప్ గ్రూమింగ్ ప్రోగ్రామ్, టాటా గ్రూప్ అందించే వివిధ క్రాస్-ఫంక్షనల్, క్రాస్-ఇండిస్టీ అవకాశాలను పెంచుకోవడానికి అధికారులను ప్రోత్సహిస్తుంది. ఒక సంవత్సరం రొటేషన్ ప్రోగ్రామ్ తర్వాత నేను తనిష్క్లో బ్రాండ్ మేనేజర్‌గా చేరాను. తర్వాత టాటా టెలిసర్వీసెస్‌లో కాంటాక్ట్ సెంటర్ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఆపరేషన్స్ పాత్రలో చేరాను. తర్వాత టీసీఎస్కి మారాను. అక్కడ వ్యాపార అభివద్ధితో పాటు P&L నిర్వహణ స్పెక్ట్రమ్‌ను కవర్ చేసే బహుళ పాత్రలను పోషించాను. ఈ కాలంలో టాటా బిజినెస్ ఎక్సలెన్స్ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాను. అనేక అసెస్మెంట్లకు నాయకత్వం వహించాను. వ్యాపార నాయకత్వం, శ్రేష్ఠతకు సంబంధించిన సమగ్ర విధానాన్ని నిజంగా ఆస్వాదించాను, అభివద్ధి చెందాను. 2016 చివరిలో టాటా టెక్నాలజీస్ సేల్స్ ప్రెసిడెంట్‌గా చేరాను. దాని అమెరికా వ్యాపారం కోసం సీఓఓగా ఉన్నాను. నా కెరీర్లో ఈ మార్పులలో ప్రతి ఒక్కటి నాయకత్వ పాత్రకు చివరికి పరివర్తనను నిర్ధారించే లక్ష్యంతో ప్రేరేపించబడింది.
ప్రస్తుతం మీ బాధ్యతలతో పాటు మీరు ఎక్కువగా ఆనందించే వాటి గురించి మాకు చెప్పండి?
నేను ప్రపంచవ్యాప్తంగా టాటా టెక్నాలజీస్ కోసం ఆటోమోటివ్ వ్యాపారాన్ని నిర్వహిస్తాను. మా కస్టమర్ సంబంధాలను పెంపొందించే బాధ్యతతో నిర్వహించాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను కనెక్ట్ చేయగల సామర్థ్యం-నిజమైన వ్యాపార ప్రభావాన్ని చూపే సొల్యూషన్లను అందించడం నేను చాలా ఆనందించే అంశం. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములతో నా పరస్పర చర్యలను ఆనందిస్తాను. వివిధ సంస్కతులను, వ్యాపారం చేయడంలో స్థానిక సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకుంటాను.
సేల్స్, టెక్ డొమైన్‌లోకి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. వారిని వర్క్‌ఫోర్స్‌లో నిలుపుకోవడానికి ఇంకా ఏమి చేయాలి?
మొత్తం మీద ఎక్కువ గుర్తింపు అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. కేవలం వైవిధ్యం మాత్రమే ఉండటం మంచిది కాదు. కానీ తప్పనిసరిగా కొంత వైవిధ్యం ఉండాలి. ఇది ఆర్థికపరమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది. సేల్స్, టెక్‌లో మహిళల సంఖ్యను పెంచడంలో సహాయపడే ప్రోగ్రామ్‌లను నడపడానికి కంపెనీలు ఏమి చేస్తున్నాయో, దానితో పాటు 70శాతం మాత్రమే సిద్ధంగా ఉన్నప్పటికీ నేను మెంటార్‌గా ఉన్న మహిళలను మరింత అడగమని నేను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను.
మీ అతిపెద్ద విజయాలు, సవాళ్లు ఏమిటి?
జట్టుగా, సమిష్టిగా ప్రతి ఒక్కరిలో ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి లోతైన నిబద్ధతతో నా అతిపెద్ద విజయాలు వచ్చాయి. నా సవాళ్లు ఏమిటంటే నేను ఇతరులకు సిద్ధంగా ఉన్నా లేదా అమలు చేయగల దానికంటే వేగంగా వెళ్లాలనుకుంటున్నాను. ఒక్కోసారి నా వేగాన్ని తగ్గించమని ఎవరైనా గుర్తు చేయాల్సి వస్తుంది.
టెక్‌లో నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉన్నారని అనుకుంటున్నారు?
మహిళల ప్రతిభను చూస్తున్నప్పుడు ప్రారంభ దశలలో తగ్గుదల ఉన్నట్టు నేను భావిస్తున్నాను. ఇది అనేక కారణాల వల్ల జరిగింది. కొందరు కుటుంబ కట్టుబాట్లు దాటలేకపోతున్నారు. వారిని ప్రోత్సహించేవారు ఱశీజూలేకపోవడం, కనిపించని వివక్ష కూడా దీనికి అడ్డంకిగా ఉంటుందని నమ్ముతున్నాను. అదే సమయంలో మహిళా నాయకులను తయారు చేయడం, అవసరమైన సలహాలు ఇవ్వడం, పెండ్లి చేసుకున్నప్పుడు పనికి ఇబ్బంది కాకుండా సూచనలు ఇవ్వడం వారి మెంటర్లుగా ఉంటున్న మాపై కూడా ఉంది. మరో విషయం చాలా తరచుగా మనపై మనం విధించుకునే ఆంక్షలు మనం సమర్థవంతంగా పని చేయగల పరిమితుల నుండి పుట్టాయి. ఇది అందరికీ సులభం అని నేను చెప్పడం లేదు. కానీ ఎవరైనా ఎంపికలను అన్వేషిస్తే తప్ప అవకాశం తప్పిపోయిందో లేదో ఎవరికీ తెలియదు.
మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ప్రతి సంస్థకు ఉంటుందంటారా?
ప్రాథమిక స్థాయిలో ఇది కేవలం ఆర్థిక అర్ధమే. కానీ వైవిధ్యం మనం పనిచేసే విధానానికి చాలా గొప్పతనాన్ని తెస్తుంది. ఉదాహరణకు బాడీ లాంగ్వేజ్ చదవడంలో మహిళలు మెరుగ్గా ఉంటారని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. అమ్మకపు పాత్రలో అది అమూల్యమైన నైపుణ్యం.
మీకు అతిపెద్ద ప్రేరణ ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎప్పుడూ నాకు కష్టమే. నా జీవితమంతా నాకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా నాన్న తన సానుకూలత, ప్రశాంతమైన ప్రవర్తనకు, నా తల్లి తన అధిక శక్తితో కూడిన ఎగ్జిక్యూషన్ నైపుణ్యాలకు, నా భర్త పెద్ద కలలపై దష్టి సారించే సామర్థ్యం, కస్టమర్ సెంట్రిసిటీ లక్షణాలను నింపిన వివిధ బాస్‌లు, నా టీం సభ్యులు ఇలా నాకు ఎంతో మంది ప్రేరణగానిలిచారు. నా పిల్లలు కూడా వారు ప్రతి క్షణాన్ని ఆస్వాదించే విధానంతో నన్ను ప్రేరేపిస్తారు.
మీ ఖాళీ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారు?
సమయం దొరికినపుడు పూల్‌లో కొన్ని మైళ్లు ఈత కొట్టడానికి ఇష్టపడతాను. పుస్తకాలు నాకు ఎల్లప్పుడూ గొప్ప సహచరులు. అన్నింటికంటే ముఖ్యంగా నా కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతాను.