Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలసిన మనసుకి ఓ కప్పు కాఫీ ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. అలసటను తగ్గించి, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అందుకే కదా.. రకరకాల పనులతో మైండు వేడెక్కగానే మనందరం ఓ కప్పు కాఫీ కోరుకునేది.. అయితే మనసుని హుషారెత్తించే కాఫీకి మేనికి మెరుపునిచ్చే శక్తి కూడా ఉందని మీకు తెలుసా? ఇంతకీ మేని మెరుపును పెంపొందించడంలో కాఫీ పాత్ర ఏమిటో చూద్దాం...
జిడ్డు చర్మం కలవారు కాఫీ డికాక్షన్లో కొద్దిగా పెరుగు గానీ, శెనగపిండి గానీ కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది. కాఫీ పొడిని ఫేస్ ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. కాఫీకి ఆలివ్ ఆయిల్‌ని జోడించి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రపరిస్తే మొటిమల బాధ తగ్గుతుంది. నిద్రలేమితో కండ్లు అలసిపోతుంటాయి. దాంతో కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలో కాఫీ డికాక్షన్ని కండ్ల చుట్టూ రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
శిరోజ సంరక్షణకు ఒకసారి కాఫీ గింజల్ని ఉపయోగించి చూడమంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం కాఫీ డికాక్షన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే శిరోజాలు పట్టుకుచ్చులా... ప్రకాశవంతంగా కనిపిస్తాయి.