Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికి వణుకుతూ... వేడి వేడి టీ తాగితే భలే హాయిగా ఉంటుంది కదూ. అయితే మామూలు చారుకి బదులు... ఈ రోజ్ మసాలా టీ తాగి చూడండి రుచితో పాటూ చక్కటి ఆరోగ్యమూ మీ సొంతం. చిక్కటి పాలల్లో తేయాకు పొడితో పాటు కాసిని ఎండు గులాబీ రేకలూ, చెంచా తులసి పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకుల్ని వేసి మరిగించాలి. బాగా మరిగిన ఈ వడకట్టిన టీకి కాస్త తేనె కలిపి వేడి వేడిగా తాగితే సరి జలుబూ, దగ్గూ వంటివి మాయవుతాయి. ఈ టీల్లో వేసిన పదార్థాల్లో యాంటీ వైరల్, యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటమే కారణం. నెలసరి నొప్పులతో బాధపడేవారు ఓ కప్పు రోజ్ మసాలా చారుని తాగి చూడండి. ఉపశమనం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇందులో వాడే గులాబీల్లో ఉండే విటమిన్ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి పానీయం ఇది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగనీయదు.