Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిక బాత్రా... తన మిక్స్డ్ డబుల్స్ భాగస్వామి జి. సత్యన్‌తో కలిసి ఇటీవలే ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5 లోకి ప్రవేశించారు. IITF-ATTU ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్యం సాధించిన తర్వాత మణిక మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళా ప్యాడ్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు నేటి మానవిలో...
మణిక కాంస్య పతక పోరులో ప్రపంచ ఆరో ర్యాంక్, మూడుసార్లు ఆసియా ఛాంపియన్ అయిన హీనా హయతాను 4-2తో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు రోజు సెమీ-ఫైనల్స్‌లో మ్మ ఇటో చేతిలో ఓడిపోయిన తర్వాత ఆమె ఇప్పటికీ కాంస్య పతక మ్యాచ్‌కు చేరుకుంది. అక్కడ ఆమె చరిత్ర సృష్టించింది.
వ్యూహం ప్రకారం...
''ఆసియా కప్ 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యున్నత ర్యాంక్ ఆటగాళ్లను ఓడించి ఇక్కడ నా ప్రదర్శనతో నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. కాంస్య పతకాన్ని గెలవడం నాకు గొప్ప విజయం. నేను ఈ టోర్నమెంట్లో చాలా సానుకూల దృక్పథంతో, నా అత్యుత్తమ ప్రదర్శనను అందించాలనే విశ్వాసంతో వెళ్లాను. నా వ్యూహం ప్రకారం ఆడగలిగాను. ప్రస్తుతం ఆడిన ఆటతో పాటు నా గత టోర్నీల నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను'' అని కాంస్యం గెలిచిన తర్వాత మణిక అన్నారు.
హెచ్చు తగ్గులు ఉంటాయి
''చిన్న మార్పులు జీవితంలో పెద్ద మార్పును కలిగించడాన్ని నేను గమనించాను. కాబట్టి నేను నిజంగా సంతృప్తి చెందాను. ఈ టోర్నమెంట్‌కు రాకముందు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల నాపై మళ్లీ నమ్మకం ఏర్పడింది. ప్రతి అథ్లెట్‌కు అది ఆడైనా మగైనా కెరీర్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. నేను నా తప్పుల నుండి ఎన్నో నేర్చుకున్నాను. మెరుగుదలకు మార్గం వేసుకున్నాను'' అంటూ మణికా తన శ్రేయోభిలాషులు, కుటుంబం, కోచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ప్రజాధరణ పొందేలా...
ఆమె పతకాన్ని గెలుచుకున్న తర్వాత అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరూ పాడ్లర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ''ఆసియా కప్‌లో భారత టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించినందుకు మణికా బాత్రాను నేను అభినందిస్తున్నాను. ఆమె విజయం భారతదేశంలోని అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. టేబుల్ టెన్నిస్‌ను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తుంది'' అని ప్రధాన మంత్రి తన ట్విట్లో రాశారు.
యువతకు స్ఫూర్తి
రాష్ట్రపతి రాసిన ట్విట్లో ''ఆసియా కప్‌లో పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచి క్రీడా చరిత్రను లిఖించినందుకు మణికా బాత్రాకు అభినందనలు. టోర్నీలో టాప్ ర్యాంకింగ్ ప్లేయర్లను ఓడించింది. ఈ విజయం మన యువతకు, ముఖ్యంగా బాలికలకు ఆమె శ్రేష్ఠతను అనుకరించేలా స్ఫూర్తినిస్తుంది'' అన్నారు.