Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరికొద్ది రోజుల్లో 2023లోకి ప్రవేశించబోతున్నాము. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో మహిళా రచయితలు చదివిన కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలను ఓసారి పరిశీలిద్దాం. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రచురణ పరిశ్రమకు కొత్త జీవితం లభించినట్టు కనిపిస్తోంది. ఈ సంవత్సరం అనేక గొప్ప పుస్తకాలు విడుదలయ్యాయి. ఇందులో అనేక మంది మొదటిసారిగా తమ పుస్తకాలు ఆవిష్కరించిన మహిళా రచయితలు ఉన్నారు. మహిళా వ్యవస్థాపకత స్థితి, భారత ఆర్థిక వ్యవస్థ, సాహసోపేతమైన మహిళల యుద్ధ దినచర్య వంటి విభిన్న విషయాలను ఈ పుస్తకాలు స్పృశిస్తాయి. అలాంటి మహిళా రచయితల ఐదు పుస్తకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: స్టోరీస్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నమితా థాపర్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ అయిన నమితా థాపర్ షార్క్ ట్యాంక్ ఇండియాలో తన వ్యాపార ప్రయాణం, నాయకత్వ అభ్యాసాల నుండి స్నిప్పెట్లను నాన్ ఫిక్షన్ నవల అయిన ది డాల్ఫిక్షన్లో పంచుకుంది. జనాదరణ పొందిన షోలో తన అనుభవాన్ని తిరిగి చూసుకుంది. వ్యాపారవేత్తగా తన జీవితంలో ఆచరణాత్మక, భావోద్వేగ విషయాలను అందిస్తుంది. ఆమె సలహాదారుల ప్రాముఖ్యతను, అడిగే శక్తిని నొక్కి చెబుతుంది. ''ఇది హోంవర్క్, హార్డ్ వర్క్, పట్టుదలతో కలిసి నన్ను ఈ రోజు ఉన్న స్థితికి తీసుకువచ్చింది. చాలా మంది వ్యక్తులు, ప్రత్యేకంగా మహిళలు వారికి సహాయం అవసరమైనప్పుడు నోరుతెరిచి అడగాలి. సరైన మార్గదర్శకులచే మార్గనిర్దేశం చేయబడితే మీ వ్యాపారంలోనే కాదు మీరు కొనసాగించడానికి ఎంచుకున్న దేనిలోనైనా విజయవంతం అవుతారనడంలో సందేహం లేదు'' అని ఆమె అంటున్నారు. ఈ పుస్తకం మొత్తం 15 అధ్యాయాలుగా విభజించబడింది. వ్యక్తిగత కథలతో కూడిన వివిధ వ్యాపార విషయాలపై ఇది దృష్టి పెడుతుంది. అంతిమంగా నాయకులు దూకుడు, సానుభూతి వంటి వాటి మధ్య సమతుల్యతను సాధించాలని ఈ పుస్తకం చెబుతుంది.
ది వార్ డైరీ ఆఫ్ ఆశా సాన్, లెఫ్టినెంట్ భారతి ఆశా సహారు చౌదరి. (తన్వి శ్రీవాస్తవ అనువదించారు)
75 ఏండ్ల కిందట 17 ఏండ్ల భారతి 'ఆశా' సహారు చౌదరి తన రోజువారీ అనుభవాలను డైరీలో రాసుకునేవారు. ఆమె తల్లిదండ్రులు ఆనంద్ మోహన్, సతీ సేన్ సహారు స్వాతంత్య్ర సమరయోధులు. వీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీతో సన్నిహితంగా ఉండేవారు. ఆమె తండ్రి, మామ సత్య సహారు అడుగుజాడల్లో ఆశా సాన్ కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరారు. రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగారు. 1946లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆశా సాన్ తల్లిదండ్రులు, ఓ హిందీ ప్రొఫెసర్ సహాయంతో జపనీస్ వెర్షన్లో ఉన్న తన డైరీని హిందీలోకి అనువదించారు. అది హిందీ పత్రిక ధర్మయుగ్‌లో సిరీస్‌గా ప్రచురించబడింది. ఈ సంవత్సరం ఆమె మనవరాలు తన్వి శ్రీవాస్తవ ఆ డైరీలను ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ది వార్ డైరీ ఆఫ్ ఆషా-సాన్ (హార్పర్‌కాలిన్స్) అనే పేరుతో ఆంగ్లలోకి అనువదించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడిన ఒక యువతి ధైర్యాన్ని ఈ పుస్తకం హైలైట్ చేస్తుంది.
సమాజ్, సర్కార్, బజార్ - ఒక సిటిజన్-ఫస్ట్ అప్రోచ్, రోహిణి నీలేకని
2022లో రచయిత్రి రోహిణి నీలేకని సమాజ్, సర్కార్, బజార్ - ఎ సిటిజన్-ఫస్ట్ అప్రోచ్‌ని దశాబ్ద కాలం పాటు వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాల సేకరణగా విడుదల చేశారు. సమాజాన్ని ప్రాథమిక రంగంగా ఉంచడం ద్వారా రాష్ట్రం, మార్కెట్ల మధ్య సమతుల్యతను పునరుద్ధరించాలనే ఆమె తత్వశాస్త్రాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం సమాజ్, సర్కార్, బజార్ యొక్క వివిధ ముఖ్యమైన అంశాలను స్పృశిస్తుంది. ఈ రోజు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలను హైలైట్ చేస్తుంది. పౌరుల బాధ్యతలు, న్యాయ వ్యవస్థలోని సమస్యలు, సుస్థిరత సవాళ్లు, డిజిటల్ యుగంలో కోవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠాలు ఇందులో ఉన్నాయి. ఇది సమానమైన సమాజాన్ని సృష్టించడంలో పౌరులుగా మన పాత్రను కూడా పరిశీలిస్తుంది.
ఓపెన్ బుక్: నాట్ క్యూట్ ఎ మెమోయిర్, కుబ్రా సాయిట్
బహుముఖ నటి కుబ్రా సైత్ జ్ఞాపకాల ఓపెన్ బుక్ ఆమె ప్రారంభ రోజులలో విస్తృతమైన ప్రచారం పొందింది. బెంగళూరులో పెరిగింది. సామాజిక ఆందోళనల్లో పాల్గొంది. బాడీ షేమింగ్ ఉద్యమంలో కూడా తన పాత్ర పోషించింది. బాల్యం, యుక్తవయసులో అనేక లోతైన వ్యక్తిగత అనుభవాల ద్వారా ఆమె ప్రయాణాన్ని గుర్తించింది. బహుముఖ నటిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఉదాహరణకు తాను పాఠశాలలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న బెదిరింపులు బాలీవుడ్లో తన బంధుప్రీతిని ఎదుర్కోవడానికి సహాయపడిందని ఆమె పేర్కొంది. నటిగా తన జీవితంలోని ఇతర అంశాల గురించి కూడా ఓపెన్‌గా చెప్పింది. దుర్వినియోగం, వన్-నైట్ స్టాండ్, అబార్షన్ వంటి విషాలను సైతం ప్రస్థావించింది. ఇది చివరికి మీపై అనేక సవాళ్లు విసిరినప్పటికీ మీ కలలను అనుసరించడం, జీవితంలో కొనసాగడం ఎందుకు ముఖ్యమో కూడా సూచిస్తుంది.
షీ ఈజ్ అన్లైక్బుల్ అండ్ అదర్ లైస్ దట్ బ్రింగ్ విమెన్ డౌన్డ్,
అపర్ణ శేవక్రమణి
2020లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో ఇండియన్ మ్యాచ్‌మేకింగ్ ద్వారా మొదటి సీజన్ (రెండవది కూడా) సీమా ఆంటీగా ప్రసిద్ధి చెందిన మ్యాచ్ మేకర్ అయిన సీమా తపారియా 'అరేంజ్డ్ ఇండియన్ మ్యారేజెస్' చిత్రీకరణ కోసం చాలా ప్రశంసలు అందుకుంది. షోలో అత్యంత అపఖ్యాతి పాలైన పాత్ర అపర్ణ శేవక్రమణి. ఆమె రియాలిటీ షో తనను ఎలా చిత్రీకరిస్తుందనే దాని గురించి ఆలోచించి ఆమె మొదట సిద్ధపడలేదు. ఆమె ప్రేక్షకుల నుండి లేదా ఆమె జీవితంలోని ప్రతి భాగాన్ని విడదీసే ట్రోల్స్ సైన్యం నుండి పొందే ద్వేషానికి కూడా ఆమె సిద్ధంగా లేదు. కానీ అపర్ణ చివరికి తన అవమానానికి వ్యతిరేకంగా మాట్లాడిన చాలా మంది మహిళల నుండి మద్దతు పొందింది. షీ ఈజ్ అన్లైక్బుల్ అండ్ అదర్ లైస్ దట్ బ్రింగ్ విమెన్ డౌన్డ్లో అపర్ణ రికార్డును సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎవరో తన ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మాట్లాడుతూ ''ఈ పుస్తకాన్ని రాయడం నా సొంత కథనాన్ని తిరిగి పొందేందుకు, నా సొంత నిబంధనలపై నా కథను చెప్పడానికి ఒక మార్గం. నా జీవితంలోని క్షణాలను పంచుకునే విధానమే నన్ను ఈ రోజు మహిళగా మార్చింది అన్నారు.