Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ ముఖాన్ని రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంతోపాటు నుదురు, ముక్కు భాగాలు శుభ్రపడతాయి. కసరత్తుల వల్ల చెమట పడుతుంది. దీనిపై దుమ్ము, ధూళి చేరడంతో చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. వ్యాయామం తర్వాత ముఖాన్ని తప్పక కడగాలి.
వారంలో కనీసం రెండుసార్లు అయినా మృతకణాలను తొలగించుకునేందుకు స్క్రబ్ చేయాలి. పావుకప్పు పెసరపిండి, కొద్దిగా పంచదార, చెంచా బొప్పాయి గుజ్జు, కాస్త నువ్వుల నూనె కలిపి ముఖానికి రాసి రుద్దాలి.
గుడ్డు తెల్లసొనలో కాస్తంత తేనె కలిపి ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి మృదువుగా మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వారానికోసారి ఈ పూత వేసుకోవాలి.