Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి గాలికి పెదాలు పగిలి పోతుంటాయి. దీని పరిష్కారంగా డీహైడ్రేషన్ తగ్గించుకుంటూనే అధరాల సంరక్షణపైనా శ్రద్ధ పెట్టాలి. ఆ చిట్కాలే ఇవి.
నువ్వుల నూనెను కాస్త వేళ్లకు అద్దుకుని పెదాలకు రాసి, మృదువుగా మర్దన చేయండి. కాస్త జిడ్డుగా అనిపించినా కాసేపటికి పెదాలకు తగిన తేమ అంది సమస్య దూరమవుతుంది.
పెదాల పగుళ్లకు వెన్నను మించిన పరిష్కారం లేదు. సమస్య తగ్గడంతో పాటు అధరాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి. చెంచా వెన్నకు చిటికెడు పంచదార చేర్చి సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా కాసేపు చేస్తే... రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదాలు కాంతివంతంగా కనిపిస్తాయి.