Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు ఉద్యోగం అంటే సాధారణంగా మనం ఒకే పొజిషన్ కూర్చొని గంటల తరబడి పని చేయాల్సి వస్తుంది. కానీ ఆ పోజిషన్ కరెక్ట్‌గా లేకపోయినా మనం పట్టించుకోము. దీంతో మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. సెర్వికల్ స్పెయిన్ వద్ద ఉండే మృధువైన నరాలపై ఒత్తిడి పడడంతో తీవ్రమైన మెడనొప్పితో బాధపడవచ్చు. ఈ మెడనొప్పి నుంచి బయటపడేందుకు తలను కొంచెం ముందుకు వంచి స్లో గా తలని పేకెత్తి పైన చూడాలి. అలా ఐదు సెకన్ల పాటు ఉంచాలి. ఈ ట్రిక్ ద్వారా మనకు మెడ నొప్పి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.