Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవాంఛిత రోమాలు.. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాగని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓసారి సంబంధిత నిపుణులను సంప్రదిస్తే కారణం తెలుసుకుని తగిన చికిత్సలు సూచిస్తారు. అలాగే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు సైతం దీనికి కొంతవరకు పరిష్కారం చూపిస్తాయి.
ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్ చక్కెర, అర-టీస్పూన్ కార్న్‌ఫ్లోర్.. ఈ మూడింటినీ ఒక బౌల్లోకి తీసుకొని బాగా గిలక్కొట్టాలి. తద్వారా ఇది మృదువైన పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ఇది గట్టిపడుతుంది. అప్పుడు దీన్ని వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు తొలగే అవకాశం ఉంటుంది.
బాగా పండిన ఒక బొప్పాయి పండును గిన్నెలోకి తీసుకొని మ్యాష్ చేయాలి. ఇందులో టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి మృదువుగా రుద్దాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇదే పద్ధతిని వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల.. ఆ ప్రదేశంలో అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.