Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి మార్కులు.. అదనంగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వీటిపై దష్టిపెడుతుంటాం. అయితే సంస్థలకు అవే సరిపోవడం లేదు. ప్రవర్తనకీ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది దష్టిపెడుతున్న కొన్ని నైపుణ్యాలు ఇవి.. ఇంటర్వ్యూలోనూ వీటిని పరిశీలిస్తారు.
కొత్తవాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సాధారణంగానే మన మహిళలకు ఎక్కువ. ఆలోచనా పరిధిని విస్తరించే ఈ నైపుణ్యం కోసం సంస్థలు చూస్తున్నాయట. అందుకోసమే.. ఇంటర్వ్యూ సమయంలో 'తరగతి గదిలో మీరడిగిన ఏ ప్రశ్న మీకు బాగా సాయపడింది, ప్రశంసలు కురిపించింది' వంటి ప్రశ్నలు అడుగుతున్నారట. దానికి ఉదాహరణతో మెప్పించగలిగితే ఉద్యోగం మీదే.
చదువు.. అదైపోగానే ఉద్యోగం అన్న రోజులు కావివి. కాలంతో పరుగు తీయాలన్నా.. మారుతున్న సాంకేతికతను అంది పుచ్చుకోవాలన్నా నేర్చుకుంటూ ఉండటం తప్పనిసరి. కొత్తగా నేర్చుకుని.. వాటిని ప్రాక్టికల్‌గా ఉపయోగించినవీ.. నేర్చుకుంటున్నవీ చెబితే సరిపోతుంది.
కొత్తగా ఈత నేర్చుకుంటున్నహొవారికి ఒక్కసారే గోదారి ఈదమంటే కష్టమే. అలాగని చిన్న చిన్న లక్ష్యాలనూ ప్రయత్నించనంటే మాత్రం పొరపాటే. స్వల్ప స్థాయి లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని సాధించడానికి ఎప్పుడూ ఎలా సిద్ధంగా ఉంటారో ఆలోచించుకోండి. అలాగే వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో కూడా చెప్పగలగాలి. ఇక్కడ మీ ఓపిక, పోటీతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే గుణాలను పరిశీలిస్తారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కోణంలో చూడటం, దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం మామూలే. అవతలి వారి కోణం నుంచీ చూసేవారే నిజమైన నాయకులు. ఇలాంటివారికే సంస్థలూ ప్రాధాన్యమిస్తాయి. ఏదైనా తగాదా, గొడవ.. వచ్చినప్పుడు ఎదుటివారి కోణం నుంచీ చూసి మీరు వెనక్కితగ్గారా? విభేదాల సమయంలో అవతలి వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడారా? గుర్తు చేసుకోండి.
జీవితంలో గెలవాలని ఎవరికుండదు? ఏదైనా తిరస్కరణ ఎదురైతే అవతలి వాళ్లపై కోపం తెచ్చుకోవడం సహజమే. మరి వాళ్లూ అలాగే ఆలోచిస్తారు కదా! లేదు.. కాదు అని చెప్పేప్పుడు మీరు మాత్రం కచ్చితంగా ఉండటం, ఎవరైనా చెప్పినప్పుడు కోపం ప్రదర్శించడం మంచి లక్షణం కాదు. ఇది బందస్ఫూర్తికి విరుద్ధం కూడా. సౌమ్యంగా.. నొప్పించని సమాధానాలు.. అందరితోనూ కలుపుగోలు ధోరణి అవసరం. ఇవన్నీ ఉంటే... ఇంటర్వ్యూలో మెప్పించడమే కాదు.. కెరియర్లో ముందుకెళ్లడమూ ఖాయం.