Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెంచా చొప్పున పాలపొడి, శనగపిండి, నారింజ రసాన్ని కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు స్థితికి వస్తుంది. రెండు చెంచాల పెరుగు, చెంచా పాలపొడి, అరచెంచా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడగాలి. పిగ్మెంటేషన్ మచ్చలు దూరమై చర్మం తాజాగా మారుతుంది.