Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడ్డు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అయితే గుడ్డు పెంకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. ప్రత్యేకించి చర్మం బిగుతుగా ఉండడానికి ఇవి ఉపయోగ పడతాయంటున్నారు నిపుణులు.
కారణమేదైనా చర్మం సాగిపోవడం వల్ల ముడతలు పడడం, గీతల్లా ఏర్పడడం సహజం. ఇవే మనల్ని వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ఈ సమస్యల్ని దూరం చేసుకోవడానికి గుడ్డు పెంకుల పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్ తేనె, టేబుల్‌స్పూన్ పాలు, కొద్దిగా గులాబీ నీరు.. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని బీటర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి ముంఖంపై కింది నుంచి పైకి అప్లై చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.