Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరోమా థెరపీ నుంచి అందాన్ని పెంచేవరకూ అన్నింట్లోనూ ఎసెన్షియల్ నూనెలే కీలకం. అందులోనూ లావెండర్ ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవేంటో తెలుసుకుందాం...
చర్మాన్ని మచ్చలూ, మృత కణాలూ నిర్జీవంగా మార్చేస్తాయి. వీటిని మాయం చేసి ముఖాన్ని మెరిపించే శక్తి లావెండర్ నూనెకే ఉంది. చెంచా బాదం ముద్దకి రెండు చుక్కల ఈ తైలాన్ని కలపండి. ఒంటికి రాసి మృదువుగా రుద్ది చూడండి. మేను మెరిసిపోతుంది.
రెండు చుక్కల లావెండర్ నూనెని పావు కప్పు బ్రౌన్ షుగర్‌లో కలిపేయండి. దీన్ని స్నానం చేసేముందు ఒంటికి రాసుకుని రుద్దుకోండి. రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలూ, యాక్నే వంటి ఇబ్బందుల్ని తగ్గిస్తుంది.
జుట్టు పొడి బారి ఇబ్బంది పెడుతున్నప్పుడు.. ఈ తైలాన్ని నువ్వుల నూనెలో కలిపి తలకు పట్టించి మర్దన చేయండి. గంట తర్వాత తలకు ఆవిరి పట్టండి. ఈ మిశ్రమం కుదుళ్లను బలంగా మారుస్తుంది.
తక్కువ సమయంలో చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... రెండు చెంచాల అరటిపండు గుజ్జుకి చెంచా తేనె, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఓ పావు గంట ఉంచాక ముఖాన్ని సవ్య, అపసవ్య దిశల్లో రుద్దుతూ మర్దన చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.