Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్తంత దళసరిగా ఉండే బచ్చలాకులో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఉన్నందున మంచి పోషకాహారం. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం...
బచ్చలికూర మధుమేహాన్ని, ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడదు. అందువల్ల ముఖం నిగారింపుతో ఉండి వయసును కనపడనివ్వదు. కురులు రాలవు, కుదుళ్లు బలంగా ఉంటాయి.
కంటిచూపును మెరుగు పరుస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తం గడ్డ కట్టదు. హృద్రోగాలను అరికడుతుంది.
బచ్చలాకు తరచూ తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
పీచు ఎక్కువ కనుక జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువున్నందున ఊబకాయం రాదు.
బచ్చలితో కూర, పచ్చడి ఏదైనా బాగుంటుంది. అరటి, మిర్చి బజ్జీల్లా బచ్చలాకు బజ్జీలు ఘుమ ఘుమలాడుతూ నోరూరిస్తాయి.
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకునేవారు బచ్చలికూరను ఏదో రూపంలో తరచూ తినాలి.