Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టు, జరీ దుస్తుల్ని ఉతకడానికి కుంకుడు కాయలు చక్కటి ప్రత్యామ్నాయం. దీనికోసం కొన్ని కుంకుడు కాయలను చల్లటి నీటిలో నానబెట్టి వాటి రసాన్ని తీయాలి. ఈ మిశ్రమంతో పట్టు, జరీ వస్త్రాలను ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు రంగు వెలిసిపోకుండా జాగ్రత్తపడచ్చు. అంటే పట్టు, ఇతర సున్నితమైన వస్త్రాల్ని మనం ఎలాగైతే షాంపూ వాష్ చేస్తామో.. ఆ షాంపూకు బదులుగా ఈ సహజసిద్ధమైన షాంపూను ఉపయోగించవచ్చు.