Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువు మధ్యలోనే ఆపేసిన అమ్మాయిలను తిరిగి పాఠశాలకు రప్పించాలి. ఉద్యోగాలు కోల్పోయిన యువతులకు ఉపాధి కల్పించాలి. ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టిని పునరుద్ధరించాలి. విధాన రూపకల్పనలో ఎక్కువ మంది మహిళలను చేర్చాలి. ఇటువంటి విషయాల్లో లింగ అసమానతలను పరిష్కరించడానికి కొన్ని చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల విడుదలైన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం...
మెకిన్సే జూలై 2020 అధ్యయనం, జూలై 2021 ×ూఉ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.8 రెట్లు కంటే ఎక్కువ మంది ఉపాధి కోల్పోయారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళలపై మహమ్మారి విధ్వంసం సృష్టించిందనే వాస్తవానికి సాక్ష్యంగా ఈ నివేదికలు ఉన్నాయి. మహమ్మారి లింగ అసమానతలను మరింత పెంచింది. శ్రామికశక్తిలో ప్రపంచ మహిళల భాగస్వామ్యం 13 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేయబడింది. అయితే పురుషుల ఉపాధి కాస్త పుంజుకుంటుంది. ప్రపంచం సాధారణ స్థితికి సిద్ధమవుతున్నప్పుడు ఈ మహమ్మారి మహిళా శ్రామికశక్తిపై చూపిన ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. కోల్పోయిన అవకాశాలను తిరిగి పొందేందుకు కృషి చేయాలి.
లింగ వ్యత్యాసం
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వారి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 లింగ సమానత్వానికి సంబంధించి 39 సంవత్సరాల గ్లోబల్ స్టెప్ బ్యాక్‌ను అంచనా వేసింది. గత నాలుగు దశాబ్దాలుగా మనం చాలా కోల్పోయాము. మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సన్నద్ధ మవుతున్నందున సమయంలో మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి వెనుక భాగంలోనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా లైంగిక, పునరుత్పత్తి విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకపోవడంతో గర్భస్రావాలు విపరీతంగా పెరిగాయి. మహమ్మారికి ముందు ప్రపంచ ఉపాధిలో 39శాతం మహిళలు సహకరించారు. అయితే 54శాతం మంది పని భారం కారణంగా ఉద్యోగాలు వదులుకున్నారు. మహమ్మారి సమయంలో వనరులకు అనాలోచితంగా ప్రాధాన్యం ఇవ్వడం మహిళల శారీరక, మానసిక క్షేమాన్ని దెబ్బతీసింది. మహిళా ఆరోగ్య సేవలు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అనే వాస్తవాన్ని గుర్తుచేసింది. మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాలలో నిర్లక్ష్యం మొత్తం కుటుంబం, సమాజ మానసిక, శారీరక శ్రేయస్సుకు హానికరం.
కోల్పోయినవి తిరిగి పొందాలి
బాలికలు, యువతులను తిరిగి పాఠశాలకు, ఉద్యోగాలకు తీసుకురావడం, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టిని పునరుద్ధరించడం, విధాన రూపకల్పనలో ఎక్కువ మంది మహిళలను చేర్చడం వంటి లింగ అసమానతలను పరిష్కరించడానికి కొన్ని చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలు బాలికలు, మహిళలను శక్తివంతం చేయడానికి సహాయపడతాయి. ఇది సానుకూల మార్పులను స్వీకరించడానికి మనస్తత్వాలను మారుస్తుంది. మనందరం మరింత సమానమైన, న్యాయమైన సమాజాన్ని సృష్టించేందుకు పక్షపాతాలను తగ్గించే దిశగా కృషి చేయడం చాలా అవసరం. ఆరోగ్యం, విద్య, పిల్లల సంరక్షణ, ఉపాధికి సంబంధించి మహిళల సమస్యలను పరిష్కరించకపోతే 2030లో ప్రపంచ +ణూ వృద్ధి వి1 ట్రిలియన్ తక్కువగా ఉంటుందని మెకిన్సే అధ్యయనం అంచనా వేసింది.
విధానాల అమలు
ప్రపంచ సమాజం పనిలో సమానత్వం వంటి కీలక లక్షణాలపై దృష్టి సారించి లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పని చేయాలి. అవసరమైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్థిక అవకాశాలను కల్పించడం, చట్టపరమైన రక్షణ, రాజకీయ స్వరానికి భరోసా ఇవ్వడం అవసరం. నిర్ణయాధికారంలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవడంతో ఇది ప్రారంభమవుతుంది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద లబ్ధిదారులలో కనీసం మూడింట ఒక వంతు మంది మహిళలు ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశించడం దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. 2020-21లో ఉపాధిహామీ కింద ఉపాధి పొందిన శ్రామిక శక్తిలో 53శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఉపాధిహామీ అమలు చేసే స్థానిక పంచాయతీలు 50శాతం మహిళా ప్రాతినిధ్యం కలిగి ఉండాలి.
కేరళలో కుటుంబశ్రీ
కేరళలో మహిళల కోసం కుటుంబశ్రీ జీవనోపాధి కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను ఎలా ప్రోత్సహించాలనే దానిపై మంచి ప్రయత్నం జరిగింది. కేరళలోని కుటుంబశ్రీ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అమెజాన్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో 2,000 మంది సూక్ష్మ మహిళా పారిశ్రామికవేత్తలు పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని వండడానికి, సరఫరా చేయడానికి 242 యూనిట్లను నిర్వహిస్తున్నారు. ఈ మహిళలు 33,000 కంటే ఎక్కువ అంగన్‌వాడీలు లేదా పిల్లల సంరక్షణ కేంద్రాలకు ఆహార పదార్ధాలను సరఫరా చేస్తారు. తద్వారా వార్షికంగా వి1 బిలియన్ల టర్నోవర్‌ను ఉత్పత్తి చేశారు.
డిజిటల్ అక్షరాస్యత పెంచాలి
ప్రస్తుత సమాజం డిజిటల్ యుగంగా మారిపోయింది. దీనికి సాంకేతికతను ఉపయో గించుకోవడం కీలకం. కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యం పెరిగిపోయింది. నేటి డిజిటల్ యుగంలో మహిళలకు సమాన అవకాశాలను అందించడానికి, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధికి ప్రాప్యతను పెంచడానికి డిజిటల్ అక్షరాస్యత సహాయపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు కూడా తాజా సాంకేతిక పరిణామాలను ఉపయోగించుకోవచ్చు. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ ఫీచర్ ఫోన్‌లు ఇంటర్నెట్‌కు ప్రాధాన్యం అందించడంలో, విస్తృత డిజిటల్ చేరికకు మద్దతు ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
కొత్త పుంతలు తొక్కాలి
సాంకేతికత పట్ల అపనమ్మకం, భయం డిజిటల్ రంగంలో మహిళల స్థానాన్ని గణనీయంగా దెబ్బతీశాయి. సహాయం కోసం ఇతరులపై ఆధారపడేలా చేసింది. డిజిటల్ అక్షరాస్యత వారి పరిధులను విస్తరించడానికి, వారిని స్వావలంబన మార్గంలో ఉంచడానికి వీలు కల్పిస్తుంది. ఆన్‌లైన్ దూరవిద్య ప్రోగ్రామ్‌ల ద్వారా నైపుణ్యం పెంచడం లేదా కొత్త నైపుణ్యాలను సంపాదించడం ద్వారా వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడంలో ఇది వారికి సహాయపడుతుంది. అందువల్ల రిమోట్ హెల్త్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా మహిళల విద్య, ఉపాధి, ఆరోగ్య పరిధిని విస్తరించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. మహమ్మారి అందరికీ విపరీతమైన సవాళ్లను సృష్టించింది. ముఖ్యంగా మహిళలకు. మహమ్మారి ప్రభావం నుండి మనం నెమ్మదిగా కోలుకుని, తదుపరి సాధారణ స్థితికి సిద్ధమవుతున్నప్పుడు మహిళలకు సమాన అవకాశాలు సృష్టించడానికి కొత్త పుంతలు తొక్కడం మన సామూహిక సామాజిక బాధ్యత.