Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం మనకు తెలిసిన అన్ని బ్యూటీ టెక్నిక్లూ పాటించేస్తాం. వాటన్నింటినీ పక్కన ఉంచి ఈసారి ఆవిరి పట్టి చూడండి. కచ్చితంగా మీ మోము మెరిసిపోతుంది.
చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్మూ, ధూళీ, ఇతర మలినాలను శుభ్రపరచడానికి ఆవిరి ఉపయోగపడుతుంది. సాధారణంగా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ని తీయాలంటే నొప్పి తప్పదు. కానీ ఆవిరి పడితే... వాటిని సులువుగా తీసేయొచ్చు. మృతకణాలు బయటికి వచ్చేస్తాయి. ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.
ఆవిరి చర్మానికి తేమనందిస్తుంది. అలాగని ఎక్కువ సేపు పెడితే... నూనె స్రవించే సహజ గ్రంథులు పొడి బారిపోతాయి. అవి ముడతలకు దారి తీయొచ్చు.
మోము సహజ మెరుపుతో కనిపించాలంటే... ఆవిరి పట్టాలి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఫలితంగా కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో చర్మం యౌవనంగా కనిపిస్తుంది.