Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట చేసే క్రమంలో దుస్తులపై నూనె మరకలు పడడం సహజం. అయితే వీటిని వదిలించడం అంత తేలిక కాదు. ఇందుకోసం ముందుగా దుస్తుల్ని చల్లటి నీళ్లలో ముంచి తీయాలి. ఆపై మరక ఉన్న చోట డిష్‌వాషింగ్ సబ్బు లేదా లిక్విడ్‌ని వేసి బాగా రుద్దాలి. ఇలా మరక పూర్తిగా తొలగిపోయే వరకు రుద్దాలి. లేదంటే బేకింగ్ సోడాను మరకపై చల్లి.. అరగంట తర్వాత బ్రష్‌తో రుద్దాలి. ఇప్పుడు వెనిగర్, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేసి కాసేపటి తర్వాత ఉతికేస్తే మరక వదిలిపోతుంది.