Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటా బయటా ఎన్ని పనులు, ఎంత ఒత్తిడి ఉన్నా మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం కూడా అవసరమే. మనం ఆనందంగా ఉంటూ ఇతరుల మన్ననలందుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఈ తేలికైన సూత్రాలు పాటించమంటున్నారు సైకాలజిస్టులు.
రోజూ చేసే వంటే, నిత్యం వెళ్లే ఆఫీసే అయినా అవి రొటీన్‌గా, మొక్కుబడిగా మారకుండా చూసుకోవాలి. దేనిమీదైనా ఆసక్తీ, అనురక్తీ ఉన్నప్పుడు నీరసం, నిస్సత్తువా తలెత్తవు. కొత్తదనాన్ని జోడించుకుంటాం. మెరుగుదల కోసం ప్రయత్నిస్తాం.
బయట దొరికే సౌందర్య సాధనాల్లో రసాయనాలు ఉంటాయి కనుక అవి మేలు కంటే కీడే చేస్తాయి. పాలు, తేనె, పసుపు, పండ్ల గుజ్జు, కూరగాయల చెక్కు.. ఇలా సహజమైనవాటితో ఫేస్‌ప్యాక్ వేసుకోండి. ముఖం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది, డబ్బు ఆదా చేసినట్లూ అవుతుంది.
టీవీ, మొబైల్ రోజుల్లో పుస్తకాలేంటి అనుకోకుండా రోజులో అరగంటయినా పుస్తకం చదవండి. అది ఎంత ప్రశాంతత నిస్తుందో మీకే అర్థమవుతుంది.
చిన్న గంధపు చెక్కలను వార్డ్రోబ్ అరల్లో పెట్టండి. సూక్ష్మ క్రిములు చేరకపోవడమే కాదు, దుస్తుల పరిమళం మనసుకు హాయి కలిగిస్తుంది.