Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటా బయటా బాధ్యతలు నెరవేర్చే సమయంలో ఒక్కోసారి ఒత్తిడికి లోనవుతుంటాం. ఆయా పనుల్లో ఆటంకాలు ఎదురైతే.. అనుకున్న రీతిలో చేయలేకపోతే మరేవో సమస్యలెదురైతే.. నిరాశా నిస్పృహలు తప్పవు. మరి ఆ బాధ, భయాల నుంచి బయటపడేదెలా? మనకు మనమే ధైర్యం చెప్పుకొని, ఉపశమనం పొందాలి. సమస్యల్ని అధిగమించాలి. అందుకు నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు చూడండి...
దుఃఖం కలిగినప్పుడు కాసేపు ఆ విషయాన్ని పక్కనపెట్టి ఒక మంచి పుస్తకం చదవండి, లేదా చక్కని సినిమా చూడండి.
- కొంతసేపు ప్రకృతిని ఆస్వాదించండి. కుదరకపోతే మబ్బుల్ని చూస్తూ కూర్చోండి, ప్రశాంతంగా ఉంటుంది.
దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కొంతసేపు నిలిపి.. అంతే దీర్ఘంగా శ్వాస వదలాలి. ఇలా అరగంటసేపు శ్వాస మీద ధ్యాస పెట్టారంటే మీలో ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది. అరగంటసేపు వ్యాయామం చేయండి.
వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను వదిలేసి ఒకసారి ఆప్తులకు ఫోన్ చేసి మాట్లాడండి.
బొమ్మలేయడం, పాట పాడటం, నృత్యం, ఎంబ్రాయిడరీ, మిమిక్రీ లాంటివేమైనా సరే.. మీకు ఇష్టమైన కళలో కొంతసేపు సాధన చేస్తే సరి.
బంధు మిత్రులెవరినైనా ఇంటికి ఆహ్వానించండి. లేదా మీరే వారింటికి వెళ్లండి. కాసేపు ఇష్టమైన వారితో ముచ్చటిస్తే తిరిగి రీఛార్జవుతారు.
కొంతసేపు పడుకోండి. సేదతీరాక ఆలోచించండి.