Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగ్గా ఏదైనా వేడుక ఉంటుందా వచ్చేస్తుందండీ పింపుల్. అందంగా కనిపించాలనుకున్నప్పుడే అలసట వేధిస్తుంటుంది. ప్రత్యేక రోజుల్లో మీదీ ఇదే పరిస్థితా? మెరిపించే చిట్కాలివిగో..
వేప పొడిలో తగినన్ని గులాబీ నీటిని కలిపి ముఖానికి పట్టించేయండి. ఆరాక తడిచేసుకుంటూ వృత్తాకారంలో ముఖమంతా రుద్దితే సరి. మొటిమల పరిమాణాన్ని తగ్గించడమే కాదు చర్మానికీ లోతైన శుభ్రత.
నిద్ర లేకపోవడం వల్ల ముఖం కాంతి విహీనంగా తయారవుతుంది. అందుకే ఉదయం లేవగానే ముఖాన్ని శుభ్రం చేసుకొని కొబ్బరి లేదా బాదం నూనెను ముఖానికి, ఒంటికి పట్టించేయండి. స్నానం తర్వాత విటమిన్ ఇ నూనెలున్న మాయిశ్చరైజర్‌ని రాస్తే సరి.
బియ్యప్పిండి, బాదం పొడి, శనగపిండిల్లో ఏదో ఒకదాన్ని టేబుల్ స్పూను తీసుకొని దానికి చెంచా చొప్పున పాలపొడి, తేనె కలిపి ముఖానికి అయిదు నిమిషాలు రుద్దేయండి. ఆపై నచ్చిన పండు లేదా టొమాటోగానీ, ఆలూ రసం కానీ పట్టించి ఆరాక కడిగేస్తే సహజ మెరుపు వచ్చేసినట్టే.