Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటి అందాన్ని మరింతగా పెంచి చూపించడానికి చాలామంది కాటుక, ఐషాడో, మస్కారా వంటివి రాస్తూ ఉంటారు. అయితే చాలామంది ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించేటప్పుడు వీటి గురించి మర్చిపోతారు. దీనివల్ల మరుసటి రోజు ఉదయానికి కండ్లు అలసినట్టుగా కనిపిస్తాయి. అంతేకాదు.. కంటి చుట్టూ నల్లని వలయాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కండ్లకు వేసుకున్న మేకప్‌ని పూర్తిగా తొలగించాక గానీ నిద్రకు ఉపక్రమించకపోవడం మంచిది. ఆ తర్వాత ఐడ్రాప్స్ కూడా వేసుకుంటే కండ్లలో పడిన దుమ్ము వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వీటితో పాటు కనురెప్పలు, కనుబొమ్మలకు కొద్ది మొత్తంలో నూనె రాసి మృదువుగా మర్దన చేసుకోవాలి.