Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్ట్రాబెర్రీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పీచు జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.
చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
స్ట్రాబెర్రీస్‌లో ప్రక్షాళన లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై డెడ్ సెల్స్‌ని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మొటిమల నివారణ కోసం స్ట్రాబెర్రీ ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీ స్క్రబ్ ఉపయోగించవచ్చు. అందుకోసం మీరు 5 నుంచి 6 స్ట్రాబెర్రీలను విత్తనాలతో సహా మెత్తగా నలిపి దానికి రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. తర్వాత అందులో కొన్ని చుక్కల వేడినీరు వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచి మసాజ్ చేయండి. ఇలా వారానికి మూడు రోజులు ప్రయోగిస్తే కొన్ని వారాల్లో మెరిసే చర్మం సొంతమవుతుంది.