Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మ విశ్వాసంతో ఉన్న పిల్లలు జీవితంలోని ప్రతి పరీక్షను సులభంగా అధిగమించగలరు. అందువల్ల తల్లితండ్రులు తమ పిల్లలలో ఆత్మ విశ్వాసం నింపేం దుకు కృషి చేయాలి. చాలా సార్లు పిల్లలు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే వారి జీవితంలో చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. ఇంకా కొందరు తమను తామే తక్కువగా పరిగణించు కుంటారు. అనాలో చితంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ఆత్మ విశ్వాసం పెరిగేలా, దానిని పెంపొందించేలా చూసుకో వడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకోసం తల్లిదండ్రులు పాటించవలసిన చిట్కాలు ఇవే...
- పిల్లలు మంచి పని చేసినప్పుడల్లా వారిని ప్రశంసించండి. ఆ తర్వాత వారు మరింత మెరుగ్గా ఆ పనిని చేసేలా ప్రోత్సహించండి. ఇంకా ప్రతి కార్యకలాపంలోనూ వారు పాల్గొనేలా ముందుకు నడిపించండి.
- మీ ఒత్తిడితో కూడిన జీవితంలో కూడా తప్పనిసరిగా పిల్లలకు కొంత సమయం ఇవ్వండి. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం చెప్పండి. వాటిని ఆసక్తిగా వినండి. అలా వారిలో జిజ్ఞాసను పెంపొందించండి.
- పిల్లలు మీకు తెలియకుండానే మీ నుంచి చాలా నేర్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ప్రతికూల వాతావరణం నుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులగా మీపైనే ఉంటుంది.
- పిల్లలు కొన్నిసార్లు తమకు తెలియకుండానే తప్పు దారిలో పయనిస్తారు. ఆ సమయంలో వారిని కూర్చోబెట్టి ఏది ఒప్పో ఏది తప్పు అని చెప్పడం చాలా మంచిది. అలా చెప్పే క్రమంలో వారికి అర్థంమయ్యేలా చెప్పండి. కానీ మీ మాటల వల్ల పిల్లలు నొచ్చుకునేలా మాట్లాడకండి.