Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఏ కొత్త రకం సెల్‌ఫోన్ వచ్చినా మన దగ్గర ఉండాలని కోరుకుంటాం. అయితే ఏ వస్తువును తరచుగా మార్చకూడదు. కొత్త మోడల్ కనిపించగానే దాన్ని కొనటం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కొంతమంది సెల్ఫోన్ల మీద పెట్టే ఖర్చు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం.
నిజానికి ఒక వ్యక్తికి ఒక సెల్‌ఫోన్ చాలు. మరీ బిజీగా ఉండే బిజినెస్‌మేన్‌కి, అర్జంటుగా ఎక్కువ మందితో టచ్‌లో ఉండాల్సిన ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే ఒకటికన్నా ఎక్కువ సెల్‌ఫోన్ అవసరమౌతుందేమో. కాని అవసరం లేకపోయినా సెల్ఫోన్లు ముచ్చటపడి కొంటే మాత్రం పొదుపు కష్టమే అంటున్నారు నిపుణులు.
సెల్‌ఫోన్ కొత్త మోడల్స్ కొనడం.. సెల్‌ఫోన్ మీద చెల్లించే డబ్బులే కాదు.. ఆ ఫోన్ల వాడకంతో కట్టే బిల్లులు కూడా వృథానే. సెల్ఫోన్లు ప్రతివారం ఒక కొత్త మోడల్ ఫీచర్స్‌తో వస్తూనే ఉంటాయి. అందరికన్నా ఆలస్యంగా కొన్నవారి దగ్గర సెల్‌ఫోన్ చక్కటి మోడల్‌ది ఉంటుంది. దాన్ని చూడగానే దానిని తాము సొంతం చేసుకోవాలని కొందరు వెంటనే షాపులకు పరిగెడుతుంటారు.
సెల్ఫోన్లు, వాటికి సంబంధించిన ఛార్జర్స్, ఇతర కవర్స్‌తో యువతీ యువకుల టేబుల్స్ గందరగోళంగా నిండి ఉంటాయి. అందుకని ఎలక్ట్రానిక్ వస్తువులను కొద్దికాలం పాటే వాడేసి పారేయకండి. వాటి కాలపరిమితిని బట్టి వాడటం.. కొత్త వస్తువులను కొనాలని ముచ్చటపడటం మానేస్తే మీరు పొదుపు చేసినవారవుతారని నిపుణులు అంటున్నారు. ప